HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Promotions In The Endowments Department Eos Promoted To Grade 1

Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Author : Vamsi Chowdary Korata Date : 13-06-2026 - 9:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.
Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

తెలంగాణ దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు ముగింపు లభించింది. శాఖను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రేడ్-2 కార్యనిర్వహణ అధికారులుగా విధుల్లో ఉన్న 26 మంది అధికారులకు గ్రేడ్-1 అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని, అర్హత సాధించిన ఈవోలకు పదోన్నతి నియామక పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ వి.హన్మంతరావు, రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐకాస కన్వీనర్ డీవీఆర్ శర్మలతో పాటు పలువురు అర్చక సంఘాల ప్రతినిధులు, శాఖాధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పదోన్నతులు పొందిన అధికారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. దేవాలయాల సర్వతోముఖాభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ‘రాష్ట్రంలోని ఆలయాల నిర్వహణ మరింత మెరుగ్గా, పారదర్శకంగా సాగాలంటే అక్కడ పనిచేసే ఉద్యోగులు, అర్చకులు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉండాలి. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని మంత్రి హామీ ఇచ్చారు. దేవాదాయ శాఖలో మరిన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు పేర్కొన్న ఆమె.. ఈ పదోన్నతులు కేవలం ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల పదోన్నతులతో పాటు ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈవో పోస్టుల భర్తీ, పదోన్నతుల ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.

ఉద్యోగుల పదోన్నతులతో పాటు అర్చక, దేవాలయ సిబ్బందికి మంత్రి కొండా సురేఖ మరో తీపి కబురు అందించారు. అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టు ద్వారా అందుతున్న వివిధ రకాల ఆర్థిక సహాయాన్ని, గ్రాంట్లను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా రిటైర్మెంట్ గ్రాట్యుటీ, పిల్లల ఉపనయనం గ్రాంట్, సొంత ఇంటి నిర్మాణ పథకానికి ఇచ్చే సాయం, అలాగే ఉన్నత విద్యా పథకం తదితర సంక్షేమ పథకాల ఆర్థిక ప్రయోజనాల పెంపు వివరాలను ఆమె వెల్లడించారు. ఈ పెంచిన నూతన ఆర్థిక ప్రయోజనాలు మరియు అలవెన్సులు అన్నీ కూడా ఈ ఏడాది అంటే 2026 ఏప్రిల్ ఒకటి నుంచే పాత తేదీ ప్రకారం అమల్లోకి వచ్చాయని మంత్రి సురేఖ స్పష్టంచేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల పట్ల రాష్ట్ర అర్చక సమాఖ్య, దేవాదాయ శాఖ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Endowments Department
  • Grade 1 Officers
  • telangana
  • Temple EO

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd