Chikoti Praveen: బీజేపీలోకి చికోటి?.. ఢిల్లీలో రాజకీయాలు
చికోటి ప్రవీణ్... ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమా పరిశ్రమ కాదు, అటు రాజకీయ నాయకుడు అంతకన్నా కాదు. అయినప్పటికీ ఆయన ఫెమస్.
- Author : Praveen Aluthuru
Date : 03-08-2023 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Chikoti Praveen: చికోటి ప్రవీణ్… ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమా పరిశ్రమ కాదు, అటు రాజకీయ నాయకుడు అంతకన్నా కాదు. అయినప్పటికీ ఆయన ఫెమస్. నిత్యం వివాదాలను వెంటేసుకుని తిరుగుతూ ఉంటారు. క్యాసినో ద్వారా పబ్లిక్ ఫిగర్ గా మారిన చికోటి జీవితంలో అనేక వివాదాలు చుట్టుముట్టాయి.
మనీలాండరింగ్ కేసులో ఆయన అనుమానితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను ఈడీ విచారించింది. ఇక తనకో ఫామ్ హౌస్ కూడా లేకపోలేదు. ఆయన ఫామ్ హౌస్ జూ మాదిరిగా సెట్ చేసుకున్నాడు. వింత వింత పక్షులు, జంతువులతో కాలక్షేపం చేస్తుంటాడు. దీంతో ఆయన పేరు తెలంగాణాలో బాగా వినిపిస్తుంది. రాజకీయ నాయకులతో సత్సంభాలు, అటు సినిమా వాళ్ళతోనూ పరిచయాలు ఉన్నాయి. అయితే చికోటి రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఢిల్లీలో బీజేపీ నేతలను కలవడం చర్చకు దారి తీసింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ని చికోటి ప్రవీణ్ ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చించుకున్నారని విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా డీకే అరుణ తోనూ చికోటి ప్రవీణ్ భేటీ అయ్యారు. దీంతో చికోటి త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన చికోటి ప్రవీణ్ ని బీజేపీ పెద్దలు ఆహ్వానిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. అయితే తనపై ఉన్న కేసుల నేపథ్యంలో చికోటి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
Read More: Recording Dance: అమ్మాయిలతో వైసీపీ నేతల రికార్డింగ్ డాన్సులు, వీడియో వైరల్