Recording Dance: అమ్మాయిలతో వైసీపీ నేతల రికార్డింగ్ డాన్సులు, వీడియో వైరల్
ఏపీలో ఏదైనా రాజకీయ సభ, సమావేశం జరిగితే కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహించడం కామన్ గా మారింది.
- By Balu J Published Date - 05:30 PM, Thu - 3 August 23

Recording Dance: ఏపీలోని ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా నాయకులు యాక్టివ్ పాలిటిక్స్ తో తమ ప్రాధాన్యం చాటుకుంటున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, ప్రజలతో మమేకమవుతూ పోటీలో నిలుస్తున్నారు. ఏపీలో ఏదైనా రాజకీయ సభ, సమావేశం జరిగితే కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహించడం కామన్ గా మారింది. కానీ కొందరు నేతలు మాత్రం రికార్డింగ్ డాన్స్ ను ఎంకరేజ్ చేస్తూ అభాసుపాలవుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు సినిమాలో చూపించిన మాదిరిగా డాన్సులు చేస్తూ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.
తాజాగా ఏపీలో దర్శిలో ఎమ్మెల్యే వేణుగోపాల్ జన్మదిన సందర్భంగా కచేరి ఏర్పాటు చేసినట్టు సమాచారం. దీంతో పాటు రికార్డింగ్ డ్యాన్సులు చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈక్రమంలో స్థానిక వైసీపీ నేతలు అమ్మాయిలతో కలిసి బాహుబలిలోని మనోహర వంటి పాటలకు డ్యాన్సులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.