KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర
- Author : Praveen Aluthuru
Date : 12-04-2024 - 5:01 IST
Published By : Hashtagu Telugu Desk
KTR: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కేడర్ కు దిశానిర్దేశం చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవితాలను ఛిద్రం చేస్తున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఘోరంగా విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఇక మోడీని బండి సంజయ్ దేవుడు అని పిలుస్తాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు నరేంద్ర మోదీ కూడా చేసిందేమీ లేదు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల లేదా వైద్య కళాశాల మంజూరు చేయలేదని ఆరోపించిన కేటీఆర్.. బిజెపి అభ్యర్థులను ఎలా ఎన్నుకుంటామని ప్రశ్నించారు. తెలంగాణలో నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన కేటీఆర్.. రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు. అభివృద్ధి చెందిన రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించాము. కానీ వారి నిర్ణయాల వల్ల తెలంగాణలో కంపెనీలు పారిపోయే స్థితికి వచ్చాయని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join
మహేశ్వరంలో ఫార్మా సిటీ సిద్ధంగా ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌కు పర్యాయపదమని అన్నారు కేటీఆర్ ఇక కొత్త ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్ ఎలా వ్యవహరిస్తుందో మాకు తెలియదు. ఫాక్స్‌కాన్ అభివృద్ధిపై స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు నిఘా ఉంచాలని కోరుతున్నాను అని కేటీఆర్ అన్నారు. తప్పుడు వాగ్దానాలతో ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత మహిళలకు ఉచిత బస్సు సర్వీసు పథకాన్ని రద్దు చేస్తుందని కేటీఆర్ అన్నారు.
Also Read: Krithi Shetty Sri Leela : బేబమ్మ కాదు బుజ్జమ్మకే ఆ ఛాన్స్..!