HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Announced Candidates For Three Mlc Seats In Telangana

BJP Announced MLC Candidates: తెలంగాణ‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీజేపీ

ఈ మేర‌కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు కిష‌న్ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జాతీయ బీజేపీ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా ఆదేశాల మేర‌కు ఈ ముగ్గురిని ఎంపిక చేసిన‌ట్లు కిష‌న్ రెడ్డి ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

  • Author : Gopi Date : 10-01-2025 - 4:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BJP Announced MLC Candidates
BJP Announced MLC Candidates

BJP Announced MLC Candidates: తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) తమ అభ్యర్థులను (BJP Announced MLC Candidates) ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డిని ప్ర‌క‌టించ‌గా.. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్యను ప్ర‌క‌టించింది. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని బీజేపీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు కిష‌న్ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జాతీయ బీజేపీ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా ఆదేశాల మేర‌కు ఈ ముగ్గురిని ఎంపిక చేసిన‌ట్లు కిష‌న్ రెడ్డి ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Also Read: Hair Care Tips: ఈ సీజ‌న్‌లో మీ జుట్టును కాపాడుకోండి ఇలా!

పులి సరోత్తం రెడ్డి (వరంగల్)

వరంగల్‌కు చెందిన పులి సరోత్తం రెడ్డి 21 సంవత్సరాలకుపైగా పాఠశాల సహాయకుడిగా (స్కూల్ అసిస్టెంట్‌), ప్రధానోపాధ్యాయుడిగా 10 సంవత్సరాలు ప‌ని చేశారు. 2012 నుండి 2019 వరకు PRTU ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో భాగంగా ఆయన చాలా చురుకుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా, కార్యకర్తగా తనదైన శైలిలో కృషి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల స‌మస్య‌ల‌ పరిష్కారానికి కూడా కృషి చేశారు.

కొమురయ్య

మల్కా కొమరయ్య స్వస్థలం ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని పెద్దపల్లి. కొముర‌య్య ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఈ పూర్తి చేశారు. తదనంతరం పాఠశాలలను స్థాపించి పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు విశేష‌మైన కృషి చేశారు. కొముర‌య్య పెద్దపల్లి, నిర్మల్‌, హైద‌రాబాద్‌లో విద్యాసంస్థలను స్థాపించారు. ప్రస్తుతం ఆయ‌న హైద‌రాబాద్‌ పల్లవి గ్రూప్‌ ఛైర్మన్‌గా ఉన్నారు.

అంజి రెడ్డి

సి. అంజి రెడ్డి స్వస్థలం మెదక్ జిల్లా రామచంద్రపురం. అంజి రెడ్డి BA మ్యాథ్స్ గ్రాడ్యుయేట్. ఈయ‌న విభిన్న రంగాలలో పెట్టుబడులు పెట్టి వ్యాపార‌వేత్త‌గా ఎదిగారు. ఈయ‌న బాల్యం నుండి జాతీయవాద భావజాలం ప‌ట్ల ఆక‌ర్షితుల‌య్యారు. ఆయ‌న భార్య గోదావరి అంజిరెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలిగా ఉన్నారు. అంజి రెడ్డి గత 20 సంవ‌త్స‌రాలుగా SR ట్రస్ట్‌ని విజ‌య‌వంతంగా నడుపుతున్నారు. ఈ ట్రస్ట్ గ్రామాల్లోని పేద‌ల‌ విద్యాభివృద్ధికి, మంచి నీరు అందించడానికి చురుకుగా పని చేస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BJP Announced MLC Candidates
  • hyderabad
  • kishan reddy
  • MLC Candidates
  • Telangana BJP
  • telugu news

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd