Hair Care Tips: ఈ సీజన్‌లో మీ జుట్టును కాపాడుకోండి ఇలా!
పెరుగులో టమాటో కలపడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది. ఇందుకోసం టమాటో పేస్ట్‌ను పెరుగుతో బాగా కలిపి హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేసుకోండి.
- By Gopichand Published Date - 04:00 PM, Fri - 10 January 25

Hair Care Tips: శీతాకాలంలో జుట్టుకు (Hair Care Tips) ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఈ సీజన్‌లో జుట్టు పొడిబారడం, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి టమాటో మంచి ఎంపిక. టమాటోలో విటమిన్ ఎ, సి, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ స్కాల్ప్ డ్యామేజ్ కాకుండా కాపాడి జుట్టు ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ సి కొల్లాజెన్‌ను పెంచుతుంది. విచ్ఛిన్నతను తగ్గిస్తుంది. పొటాషియం చుండ్రు, దురదను తగ్గించే స్కాల్ప్‌కు పోషణ, తేమను అందిస్తుంది. అయితే మీ జుట్టుకు టమాటోతో పాటు ఇంకా ఏ పదార్థాలు వాడవచ్చో చూద్దాం.
టమాటో- అలోవెరా
టమాటోలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలబందతో కలిపి జుట్టుకు పట్టించడం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని కోసం మీరు టమాటో గుజ్జును గ్రైండ్ చేసి, అలోవెరా జెల్‌తో కలిపి హైడ్రేటింగ్ పేస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. దీని తరువాత మీ జుట్టు మీద 30 నిమిషాలు ఉంచి, ఆపై కడగాలి. ఇలా చేస్తే జుట్టు పెరుగుతుంది.
Also Read: Minister Ponnam: ప్రైవేట్ ట్రావెల్స్‌కు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!
టమాటో- పెరుగు
పెరుగులో టమాటో కలపడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది. ఇందుకోసం టమాటో పేస్ట్‌ను పెరుగుతో బాగా కలిపి హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేసుకోండి. దీని తరువాత జుట్టు మీద 30 నిమిషాలు అప్లై చేసి, కడగాలి. ఇది మీ జుట్టును సిల్కీగా, మృదువుగా ఉంచడమే కాకుండా స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
టమాటో- గుడ్డులోని తెల్లసొన
టమాటో- గుడ్డులోని తెల్లసొనతో హెయిర్ మాస్క్ చేయడానికి టమాటోను గ్రైండ్ చేసి అందులో గుడ్డులోని తెల్లసొనను మిక్స్ చేసి పేస్ట్‌ను సిద్ధం చేయండి. దీని తరువాత ఈ పేస్ట్‌ను జుట్టుపై 15 నిమిషాలు ఉంచి, ఆపై కడగాలి. టమాటోలు, గుడ్డు ప్రోటీన్ యాంటీఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది జుట్టును బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా చుండ్రును తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.