HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Transgenders In Hydraa Eagel Team

HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Author : Prasad Date : 29-05-2026 - 4:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hydraa
Hydraa

సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్ష, నిర్లక్ష్యానికి గురవుతున్న ట్రాన్స్‌జెండర్ సమాజానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కొత్త ఆశాకిరణంగా నిలిచింది. హైడ్రా ఏర్పాటు చేసిన ‘ఈగిల్ టీమ్’లో 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఈ బృందంలో 11 మంది ట్రాన్స్ మహిళలు, 5 మంది ట్రాన్స్ పురుషులు ఉన్నారు. వీరు హైడ్రా సిబ్బందితో కలిసి ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, పార్కులు తదితర ప్రజా ఆస్తుల పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇప్పటికే ఈగిల్ టీమ్ పలు కీలక కార్యక్రమాల్లో తమ ప్రతిభను చాటుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో 862 ఎకరాల ప్రభుత్వ భూమి పరిరక్షణలో భాగస్వామ్యమైంది. అలాగే మాధాపూర్‌లోని ఈదులకుంట పరిరక్షణ చర్యల్లో కూడా చురుకుగా పాల్గొంది. ముఖ్యంగా స్థానిక ప్రజలు, మహిళలతో సానుకూలంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించడంలో ఈ బృందం విశేష పాత్ర పోషించింది. హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాన్స్‌జెండర్ సిబ్బంది సహనం, భావోద్వేగ అవగాహనతో వ్యవహరించడం వల్ల కఠిన పరిస్థితుల్లో కూడా ప్రజలను ఒప్పించడంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. హైడ్రా యూనిఫాం ధరించిన తర్వాత సమాజంలో తమకు గౌరవం పెరిగిందని ఈగిల్ టీమ్ సభ్యురాలు గాయత్రి తెలిపారు. అవకాశం కల్పిస్తే ట్రాన్స్‌జెండర్లు ఏ రంగంలోనైనా రాణించగలరని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఉద్యోగం తమకు సమాజంలో భాగమైన అనుభూతిని కలిగించిందన్నారు. ప్రకృతిని కాపాడే కార్యక్రమంలో భాగస్వాములు కావడం గర్వంగా ఉందని రుచిత తెలిపారు. ఉద్యోగానికి ముందు జీవనోపాధి కోసం భిక్షాటన చేయాల్సి వచ్చేదని, సమాజంలో అవమానాలు ఎదుర్కొనేవారమని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు యూనిఫాం ధరించిన తర్వాత ప్రజలు గౌరవంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఈగిల్ టీమ్‌లోని పలువురు సభ్యులు ప్రస్తుతం తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, సమాజానికి ఉపయోగపడుతున్నామనే ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • hyderabad
  • HYDRAA
  • telangana
  • Transgender

Related News

Cm Revanth

Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా రూ.2,000 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్ర

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • NTR

    NTR : అమీర్ పేట‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • ‘Aakash’ Educational Gift : దేశ రక్షణ దళాలకు ‘ఆకాశ్’ విద్యా కానుక

  • Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Congress : క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం. డిప్యూటీ సీఎం ప‌ద‌వి త‌న కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా

  • HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd