HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Seven Members Arrest In Advocate Murder Case

Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Author : Prasad Date : 29-05-2026 - 4:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arrest
Arrest

హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మే 23న మసాబ్ ట్యాంక్‌లోని తన నివాసం వెలుపల ఖాజా మొయిజుద్దీన్‌పై కారు దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతరం మృతి చెందారు. మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్ చేసిన ఫిర్యాదు మేరకు.. వక్ఫ్ భూములు వివాదాలకు సంబంధించి మహబూబ్ ఆలం ఖాన్, ఆయన కుమారుడు ముజాహిద్ ఆలం ఖాన్‌ల నుంచి తన తండ్రికి గత కొన్ని నెలలుగా బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. గత కొన్నేళ్లలో తన తండ్రిపై ఐదుసార్లు దాడులు జరిగినట్లు కూడా పేర్కొన్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా మే 24న మహబూబ్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్‌లను పోలీసులు విచారణకు పిలిచారు. అనంతరం పరారీలోకి వెళ్లిన తండ్రీకొడుకులు.. ఢిల్లీకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా హర్యానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముజాహిద్ ఆలం ఖాన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షుడిగా, మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్ ఆలం ఖాన్ అన్వర్-ఉల్-ఉలూమ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో మరో నిందితుడు వినయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు దాదాపు ఆరు నెలల ముందే మొయిజుద్దీన్ కదలికలను గమనిస్తూ ప్రణాళికాబద్ధంగా నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. సీనియర్ న్యాయవాది హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనతో న్యాయ, రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై పూర్తిగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • advocate
  • crime
  • hyderabad
  • murder

Related News

Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

ఒక ఉబెర్ డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, ఒకప్పుడు అమెజాన్‌లో ఉద్యోగిగా పనిచేసిన ఆ డ్రైవర్, డ్రైవింగ్ పట్ల తనకున్న అభిరుచిని కొనసాగించడానికి ఉద్యోగాన్ని వదిలేశాడని వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి, తన నగరాన్ని అన్వేషిస్తూనే వివిధ నగరాల ప్రజలను కలుసుకునేందుకు వీలు కల్పించే ఉబెర్‌లో చేరాడు. ఉద్యోగి అమెజాన్‌ను వదిలి ఉబెర్

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

  • Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

  • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd