HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Free Ivf Treatment In Gandhi Hospital

IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Author : Prasad Date : 29-05-2026 - 5:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Ivf Day
World Ivf Day

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి గాంధీ ఆస్పత్రి మరోసారి నిదర్శనంగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్‌లో ఉచితంగా చికిత్స పొందిన భువనగిరి జిల్లాకు చెందిన ఓ మ‌హిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. రవి, సౌమ్య దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైనప్పటి నుంచి సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో వారు పలు ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లలో చికిత్స చేయించుకుని లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఆ దంపతులు OI, IUI సహా దాదాపు 12 సంతాన సాఫల్య ప్రక్రియలు చేయించుకున్నప్పటికీ విజయవంతం కాలేదు. గత ఏడాది గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ కేంద్రాన్ని ఆశ్రయించిన ఈ దంపతులను పరీక్షించిన వైద్యులు ఐవీఎఫ్ చికిత్సను సూచించారు.

డాక్టర్లు శోభ, ఫాతిమా పర్యవేక్షణలో నిర్వహించిన చికిత్స మొదటి ప్రయత్నంలోనే విజయవంతమై గర్భం దాల్చారు. మే 27న గాంధీ ఆస్పత్రిలో సుమారు 3.6 కిలోల బరువున్న పండంటి బాబు జన్మించాడు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఐవీఎఫ్ చికిత్స, గర్భధారణ సమయంలో అవసరమైన పరీక్షలు, మందులు, ప్రసవం వరకు మొత్తం వైద్య సేవలను గాంధీ ఆస్పత్రి పూర్తిగా ఉచితంగా అందించినట్లు వైద్యులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో భారీ ఖర్చులు భరించలేని వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాణ్యమైన ఐవీఎఫ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచుతుందని ఆమె పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gandhi hospitals
  • hyderabad
  • IUI
  • IVF

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd