Telangana Maoist Party: తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ
డిసెంబర్ చివరి వారంలో చొక్కారావు తల్లిని కలిసి నిత్యావసర సరుకులను ములుగు ఎస్పీ శబరిష్ అందించిన విషయం తెలిసిందే.
- Author : Gopichand
Date : 18-01-2025 - 9:56 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Maoist Party: తెలంగాణ మావోయిస్టు పార్టీకి (Telangana Maoist Party) భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన వ్యక్తి బడే చొక్కారావు. మావోయిస్టు నేత ఆజాద్ తో పోటీపడి గతేడాది తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి పదవికి చొక్కారావు ఎంపికయ్యారు. డిసెంబర్ చివరి వారంలో చొక్కారావు తల్లిని కలిసి నిత్యావసర సరుకులను ములుగు ఎస్పీ శబరిష్ అందించిన విషయం తెలిసిందే. చివరి క్షణాల్లో ఉన్నానని, అజ్ఞాతం వీడి ఇంటికి తిరిగి రావాలని తన కుమారుడు చొక్కారావుకు తల్లి బతుకమ్మ బహిరంగంగా కూడా పిలుపునిచ్చింది. చొక్కారావుపై రూ. 50 లక్షల రివార్డ్ ఉంది.
Also Read: Housing Policy: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో హౌసింగ్ పాలసీ!
ఛత్తీస్‌ఘడ్ కాంకేర్ ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ లో హిడ్మా, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌కౌంటర్ లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే పోలీసులకు దొరకకుండా దామోదర్ మృతదేహాన్ని హిడ్మా దళం తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. చొక్కారావు 30 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. చొక్కారావుతో పాటు 17 మంది మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటనలో పేర్కొంది.