Vivo Y78 5G: వివో నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియ
- By Nakshatra Published Date - 05:34 PM, Thu - 11 May 23
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల అభిరుచుల మేరకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లతో అద్భుతమైన లుక్ తో ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకుచ్చింది వివో సంస్థ. అంతేకాకుండా వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లను అందిస్తోంది. ఇది ఇలా ఉంటే వివో సంస్థ మార్కెట్ లోకి వివో వై 78 5జీ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈనెల 17వ తేదీన గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల విషయానికి వస్తే..
ఇందులో మూడు రకాల వేరియంట్లు ఉన్నాయి. వాటిలో 8జీబీ ర్యామ్ 128జీబీ వేరియంట్, 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ మోడల్, 12జీబీ ర్యామ్ 256జీబీ వేరియంట్ లతో లభించనున్నాయి. కాగా ఆ స్మార్ట్ ఫోన్స్ ధర విషయానికి వస్తే…మొదటి వేరియంట్ ధర రూ.16,600 గా ఉంది. అలాగే రెండో వెరియంట్ ధర భారత్ లో రూ. 20,120 గా ఉంది. మూడో వేరియంట్ ధర రూ. 23,675 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల విషయానికొస్తే.. ఇందులో 6.64 అంగుళాల IPS LCD డిస్ప్లేతో 1,080 x 2,388 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్ ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను, MediaTek DimCity 7020 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇంకా Android 13 ఆధారిత FunTouch 3 OS మద్దతుతో ఈ ఫోన్ పని చేస్తుంది.
కాగా ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే వివో వై 78 5జీ స్మార్ట్ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వాటిలో ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్, రెండో కెమెరా 2 మెగా పిక్సెల్ సెన్సార్‌తో వస్తుంది. ఇదే కాకుండా, 8 మెగా పిక్సెల్ సెన్సార్ సామర్థ్యంతో సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది. కెమెరా ఫీచర్లలో నైట్ మోడ్, పోర్ట్రెయిట్ లైట్ ఎఫెక్ట్, వీడియో ఫేస్ బ్యూటీ వంటి అనేక ఇతర ఎడిటింగ్ ఎంపికలు కూడా ఉండడం దీని ప్రత్యేకత. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ మృతి అన్ని కలిగి ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G సపోర్ట్, బ్లూటూత్ 5.0, 4G LTE, Wi-Fi, 5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్ సి పోర్ట్ కూడా ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇందులో ఇన్స్టాల్ చేయబడింది.
Related News
Iyer- Kishan: అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరో అవకాశం ఇచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మరోసారి అవకాశం కల్పించింది.