HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Work From Home For Government Employees Chandrababu Makes Key Announcement

Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

  • Author : Vamsi Chowdary Korata Date : 14-05-2026 - 10:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu Naidu
CM Chandrababu Naidu

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది.

ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పైనా ఉంటుందని, ప్రజలందరూ పొదుపు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఇంధనం వాడకాన్ని తగ్గించడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఒక పరిష్కారంగా ప్రస్తావించారు.

ప్రధాని సూచనల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై స్పందించారు. ఏపీలో ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో ప్రపంచమంతా ఇంటి నుంచే పనిచేసే రోజులు రాబోతున్నాయని, దానికి అనుగుణంగా మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు. ఇంధన పొదుపు కోసం అనవసర ప్రయాణాలు తగ్గించి, టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి పనిచేసేందుకు వీలున్న విభాగాలు, కార్యాలయాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఉద్యోగులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు. కొందరికి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్, మరికొందరికి హైబ్రిడ్ విధానంలో (కొన్ని రోజులు ఇల్లు, కొన్ని రోజులు ఆఫీస్) పనిచేసే అవకాశాన్ని కల్పించే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించి, స్పష్టమైన మార్గదర్శకాలతో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • AP government
  • AP government employees
  • Indian PM Narendra Modi
  • work from home

Related News

US President Trump to visit India; to meet Prime Minister Modi.

Donald Trump: భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీతో భేటీ.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ-ట్రంప్‌ల మధ్య అద్భుతమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది చివర్లో తాను భారత్‌కు వచ్చి ట్రంప్‌ పర్యటన ఏర్పాట్లను ఖరారు చేసే అవకాశం ఉందని రూబియో వెల్లడ

  • 'Made in Jonnagiri' gold enters the market.

    Jonnagiri Gold Mine: మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం

  • Massive influx of students from private schools to government schools in AP.

    Nara Lokesh: ఏపీ ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక

  • AP government gives key posting to IAS officer Srilakshmi.

    IAS Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మీకి ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్..

  • AP CM Chandrababu's funny tweet... Netizens are laughing heartily.

    CM Chandrababu Tweet: ఏపీ సీఎం చంద్రబాబు ఫన్నీ ట్వీట్.. తెగ నవ్వుతున్న నెటిజన్లు

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd