Heavy Rains
-
#Telangana
PM Modi : సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్..వర్షాలు, వరదలపై ఆరా
రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని గురించి ప్రధని మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టి కి తీసుకెళ్లారు.
Published Date - 11:04 PM, Sun - 1 September 24 -
#Andhra Pradesh
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ..
ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుఉతోంది. ఇప్పటి వరకు 9.18 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చినట్టు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.
Published Date - 10:36 PM, Sun - 1 September 24 -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం..అధికారులకు ఆదేశాలు
వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో పరిస్థితులపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొన్నారు.
Published Date - 10:19 PM, Sun - 1 September 24 -
#Andhra Pradesh
Rains Effect : విజయవాడ కు వెళ్లే 132 రైళ్లు రద్దు
అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP & Telangana) రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో వర్షం పడడం తో నగరంలో సగంపైగా కాలనీ లు నీట మునిగాయి. వర్షాల కారణంగా విజయవాడ (vijayawada) డివిజన్‌లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలకొంది. దీంతో […]
Published Date - 09:08 PM, Sun - 1 September 24 -
#Telangana
Ponnam : ఏదైనా సమాచారం..సహాయం కొరకు ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొన్నం
ఏదైనా సమాచారం లేదా సహాయం కొరకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లోని 08457230000 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రజలు సంప్రదించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Published Date - 08:27 PM, Sun - 1 September 24 -
#Andhra Pradesh
School Holidays: భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఏపీ విద్యాసంస్థలకు సెలవు
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అవసరమైతే మారుమూల గ్రామాలకు సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపిస్తామని ముఖ్యమంత్రి సూచించారు.
Published Date - 07:47 PM, Sun - 1 September 24 -
#Telangana
Heavy rains : ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సంవత్సరం వరదల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతోనే రెండు నెలల ముందే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ముందస్తుగా అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు.
Published Date - 07:20 PM, Sun - 1 September 24 -
#Andhra Pradesh
CM Chandrababu : భారీ వర్షాలు..సింగ్ నగర్‌లో సీఎం చంద్రబాబు పర్యటన
ఇలాంటి విపత్తును విజయవాడలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బోటులో వెళ్లి సింగ్ నగర్, తదితర వరద ప్రాంతాలపు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహయక చర్యలను పర్యవేక్షించారు.
Published Date - 05:55 PM, Sun - 1 September 24 -
#Telangana
Khammam Rains: ఖమ్మం ఆకేరు వాగులో ఐదుగురు యువకులు గల్లంతు
ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు బయల్దేరిన ఐదుగురు వ్యక్తులు మధు, గోపి, బన్నీ, వీరబాబు, మరో గుర్తుతెలియని వ్యక్తి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
Published Date - 02:26 PM, Sun - 1 September 24 -
#Speed News
Railway Track Destroyed: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. వరద ధాటికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..!
భారీ వర్షం కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్-మహబూబాబాద్ రహదారి మధ్య నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Published Date - 10:31 AM, Sun - 1 September 24 -
#Cinema
Chiranjeevi: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అభిమానులు అండగా నిలవాలి: చిరంజీవి
రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు గత మూడు రోజులుగా దంచికొడుతున్నాయి. దీనిపై ప్రభుత్వాలు సైతం అలర్ట్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 09:37 AM, Sun - 1 September 24 -
#Andhra Pradesh
CM Chandrababu : భారీ వర్షాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల మంత్రులతో సహా కీలక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని స్థాయిల ప్రభుత్వ పాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కాలంలో అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన చెప్పారు.
Published Date - 05:18 PM, Sat - 31 August 24 -
#India
Gujarat Floods : వరద వలయంలో గుజరాత్.. సురక్షిత ప్రాంతాలకు 23,870 మంది
వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలోని ఏడు వంతెనలను మూసివేశారు.
Published Date - 10:23 AM, Wed - 28 August 24 -
#India
Gujarat Rains Live Updates: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు, ముగ్గురు మృతి, స్కూళ్లకు సెలవు
గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నివాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరిందని వడోదర నివాసి తెలిపారు. ప్రజలు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు
Published Date - 01:53 PM, Tue - 27 August 24 -
#India
Weather Forecast Today: అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ..!
IMD అంచనా ప్రకారం.. ఈ సాయంత్రం నాటికి ఢిల్లీలో వాతావరణం మారుతుంది. రాబోయే 3 రోజులు వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఆగస్టు 31 వరకు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 08:46 AM, Tue - 27 August 24