HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rains 1400 Buses Canceled In Telangana

Heavy rains : భారీ వర్షాలు..తెలంగాణలో 1400 బస్సులు రద్దు

భారీవర్షాల కారణంగా టీజీఎస్‌ ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉదయం నుంచి 570 కలిపి 1400కు పైగా బస్సులను రద్దు చేసింది.

  • Author : Latha Suma Date : 02-09-2024 - 3:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
111
Heavy rains..1400 buses canceled in Telangana

Heavy rains : గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాల కారణంగా టీజీఎస్‌ ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బస్సులను రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉదయం నుంచి 570 కలిపి 1400కు పైగా బస్సులను రద్దు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపుగా వెళ్లే రోడ్లన్నీ జలమయం కావడంతో ఆయా మార్గాల్లో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత మళ్లీ నడుపుతామని చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. వరద ప్రవాహం వల్ల వికారాబాద్‌లో 212 బస్సులకు బదులు 50 మాత్రమే నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత తెలిపారు.

Read Also: Mushroom Benefits : ఆరోగ్యానికి అమృతం..! మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పుట్టగొడుగు..!

మరోవైపు తెలంగాణ, ఏపీలో వానలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీంతోపాటు 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. రద్దయినవాటిలో సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, సోమవారం ఉదయం 96 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.

కాగా, వరద ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని చెప్పిన సీఎం, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని విధుల్లో నిమగ్నం కావాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక ఏర్పాట్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read Also: Spirituality: దేవుడు ఫోటోకి పెట్టిన పువ్వులు కింద పడితే దాని అర్థం ఏంటో తెలుసా?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • heavy rains
  • telangana
  • TGS RTC

Related News

Rain's impact... roads turned into rivers.

Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

గురువారం ఉదయం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)పై భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు నీట మునిగి, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఈ ప్రాంతంలోని పలు చోట్ల రోజువారీ ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ మరియు బులంద్‌షహర్ నుండి వచ్చిన వీడియోలు జలమయమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. నీట మునిగిన వీధుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా,

  • Heavy rains in Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

Latest News

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

  • Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd