CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని.. ప్రమాదంలో ఉంటే ఈ నంబర్‌కు కాల్ చేయొచ్చు..!
వరద ప్రభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు తాజాగా రెండోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
- By Gopichand Published Date - 12:09 AM, Mon - 2 September 24

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వరద పరిస్థితి గురించి సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu)ను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం తీసుకుంటున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు.
వరద ప్రభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు తాజాగా రెండోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాల్లో 2.76 లక్షల మంది వరద బాధితులు ఉన్నారని, వీరందరికీ ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ‘‘సింగ్‌నగర్‌లో పరిస్థితిని పరిశీలించా.. బాధితులతో మాట్లాడా. వరదనీరు ఇంకా పెరిగే అవకాశముంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి వరద పరిస్థితి వివరించా. 6 హెలికాప్టర్లు, 40 పవర్ బోట్లు, 10 ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌లు పంపిస్తామని చెప్పారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: PM Modi : సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్..వర్షాలు, వరదలపై ఆరా
ప్రమాదంలో ఉంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి
వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసర సహాయం కోసం కమాండ్ కంట్రల్ నంబర్లు 112, 107 ఫోన్ చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి సహాయం కోరతామని చంద్రబాబు వివరించారు.
సీఎం రేవంత్‌కు కూడా మోదీ ఫోన్
సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను ప్రధానికి సీఎం వివరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలందించే హెలికాప్టర్లను పంపిస్తామని, కేంద్రం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.