HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Railway Track Destroyed Due To Flood

Railway Track Destroyed: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. వ‌ర‌ద ధాటికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌..!

భారీ వర్షం కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్-మహబూబాబాద్ రహదారి మధ్య నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

  • Author : Gopi Date : 01-09-2024 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Railway Track Destroyed
Railway Track Destroyed

Railway Track Destroyed: తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు గ‌త మూడు రోజులుగా దంచికొడుతున్నాయి. ఎక్క‌డివారు అక్క‌డే ఆగిపోయారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా బ‌య‌ట కాలు పెట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణలో వ‌ర్షం ధాటికి ప‌లు రైల్వే ట్రాక్‌లు కొట్టుకుపోగా (Railway Track Destroyed).. ఆర్టీసీ బ‌స్సులు వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయాయి.

భారీ వర్షం కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్-మహబూబాబాద్ రహదారి మధ్య నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కట్టపై వరద నీటిలో RTC బస్సు నిలిచిపోయింది. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను ప్రయాణికులు వేడుకుంటున్నారు.

TG: భారీ వర్షం కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్-మహబూబాబాద్ రహదారి మధ్య నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కట్టపై వరద నీటిలో RTC బస్సు నిలిచిపోయింది. రాత్రి నుంచి ఇక్కడే… pic.twitter.com/oQn7peypgf

— ChotaNews (@ChotaNewsTelugu) September 1, 2024

ఈ విష‌యం తెలుసుకున్న అధికారులు బ‌స్సులోని (TS24Z 0018) ప్ర‌యాణికుల‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టారు. కొంద‌రు అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప్ర‌యాణికుల‌కు ధైర్యం చెబుతున్నారు. వరద నీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని స్థితిలో ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఆహరం, మంచినీళ్ళను అధికారులు అందించారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై మ‌హబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ స్పందించారు. వాగులో చిక్కుకున్న ప్రయాణికుల విషయం సీఎస్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు ఎమ్మెల్యే తెలిపారు. బస్సులోని ప్రయాణీకులను వెంటనే కాపాడాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీచేశారు.

Also Read: Group 3 Edit Option: గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అల‌ర్ట్‌.. సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు ఛాన్స్‌..!

వ‌ర‌ద ధాటికి కొట్టుకుపోయిన‌ రైల్వే ట్రాక్

మహబూబాబాద్‌‌ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్‌ ధ్వంసమైంది. ఎగువు, దిగువ రైలు మార్గాల్లో కంకర కొట్టుకుపోయింది. మహబాబూబాద్‌ శివారులో రైలుపట్టాలపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో మచిలీపట్నం, సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి.

We’re now on WhatsApp. Click to Join.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రము మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి కొట్టుకపోయిన రైల్వే ట్రాక్.

మహబూబాబాద్ లో నిలిచిన మచిలీపట్నం ఎక్స్ ప్రెస్, పలు రైళ్ల నిలిపివేత pic.twitter.com/mQwLRNYoiH

— Sarita Avula (@SaritaAvula) September 1, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Destroyed
  • floods
  • heavy rains
  • Kesamudram
  • MAHABUBABAD
  • railway track
  • Railway Track Destroyed
  • telangana

Related News

Rain's impact... roads turned into rivers.

Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

గురువారం ఉదయం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)పై భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు నీట మునిగి, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఈ ప్రాంతంలోని పలు చోట్ల రోజువారీ ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ మరియు బులంద్‌షహర్ నుండి వచ్చిన వీడియోలు జలమయమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. నీట మునిగిన వీధుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా,

  • Heavy rains in Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

Latest News

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd