HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Visited Singh Nagar

CM Chandrababu : భారీ వర్షాలు..సింగ్‌ నగర్‌లో సీఎం చంద్రబాబు పర్యటన

ఇలాంటి విపత్తును విజయవాడలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బోటులో వెళ్లి సింగ్‌ నగర్‌, తదితర వరద ప్రాంతాలపు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహయక చర్యలను పర్యవేక్షించారు.

  • By Latha Suma Published Date - 05:55 PM, Sun - 1 September 24
  • daily-hunt
Cm Chandrababu Visited Sing
cm-chandrababu-visited-singh nagar

CM Chandrababu : ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాంటి విపత్తును విజయవాడలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. బోటులో వెళ్లి సింగ్‌ నగర్‌, తదితర వరద ప్రాంతాలపు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహయక చర్యలను పర్యవేక్షించారు. బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూశా. వరద నీరు తగ్గే వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తా. బాధితుకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం.. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీకు దగ్గర్లోనే ఉంటా అన్ని చంద్రబాబు వరద బాధితులకు భరోసా ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

పర్యటనకు ముందు సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాజా టోల్‌గేట్‌, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందన్నారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని చెప్పారు. గుంటూరు, విజయవాడలో సహాయక చర్యలు చేపట్టామన్నారు.

”అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. వర్షాలు, వరదల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కొండచరియలు పడటం, కారులో చనిపోవడం, వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం బాధాకరం. పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. బుడమేరు వల్ల వీటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి ఆగింది. ప్రకాశం బ్యారేజీ కింద పలు చోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేస్తున్నాం.

Read Also: Telangana Rains : తెలంగాణకు తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపుతున్న కేంద్రం

వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టాం.. 17 వేల మందిని తరలించాం. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వరదముంపు ప్రాంతాలకు బోట్లు పంపించాం. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడిక్కడ ఏర్పాట్లు చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు చేపడతాం. ప్రజల ప్రాణాలు కాపాడటమే మా తక్షణ కర్తవ్యం. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సత్వర చర్యలు చేపడుతున్నాం. వరద ప్రాంతాల్లో బియ్యం, పప్పు, నూనె, పంచదార, కూరగాయలు పంపిణీ చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇస్తున్నాం. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తాం..అని సీఎం అన్నారు.

కాగా, గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఆడపిల్లల రక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రమంతా ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం దారుణం. ఆడబిడ్డలపై దుష్ప్రచారం చేయడం మంచిదికాదు. దిల్లీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నాం. అనుమానం ఉన్నవారిని ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేస్తాం. గుడ్లవల్లేరు ఘటనపై ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వాలి” అని చంద్రబాబు అన్నారు.

Read Also:Hussain Sagar : హుస్సేన్ సాగర్‌కు భారీగా ఇన్ ఫ్లో… నాలుగు స్లూయిస్ గేట్లు తెరిచి నీటి విడుదల 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • CM Chandrababu
  • heavy rains
  • Singh Nagar
  • tdp

Related News

CM Chandrababu

CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీల‌క సూచ‌న‌లు!

వర్షాల కారణంగా రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చూడాలి. విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.

  • Social Media

    Social Media: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాపై మంత్రుల‌తో క‌మిటీ!

  • YS Sharmila

    YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!

  • Andhra Pradesh

    Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

  • Ap Gst

    GST : GST లాభాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం – సీఎం చంద్రబాబు

Latest News

  • IT Industry Performamce: షాకింగ్ రిపోర్ట్‌.. మందగిస్తున్న భారత ఐటీ రంగం!

  • Namibia: 2026 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన న‌మీబియా!

  • Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

  • Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ రికార్డు.. ఈ ఏడాది అత్యధిక WTC వికెట్లు!

  • West Indies: భారత బౌలర్ల ధాటికి విండీస్‌ 162 పరుగులకే ఆలౌట్‌!

Trending News

    • Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

    • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

    • Vijayadashami: రేపే దసరా.. విజయదశమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    • Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd