Chiranjeevi: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అభిమానులు అండగా నిలవాలి: చిరంజీవి
రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు గత మూడు రోజులుగా దంచికొడుతున్నాయి. దీనిపై ప్రభుత్వాలు సైతం అలర్ట్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- By Gopichand Published Date - 09:37 AM, Sun - 1 September 24

Chiranjeevi: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి 12.30-2.30 మధ్య తీరాన్ని దాటింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. లోతట్టు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అయితే రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు గత మూడు రోజులుగా దంచికొడుతున్నాయి. దీనిపై ప్రభుత్వాలు సైతం అలర్ట్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రజలకు కీలక సూచనలు చేశారు. తన ఎక్స్ వేదిక ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. అభిమానులు ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. “తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను” అని చిరంజీవి ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో వర్ష ప్రభావం దృష్ట్యా రేపు (సోమవారం) స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు.
Also Read: Vijayawada Rains : 30 ఏళ్ల రికార్డు బ్రేక్.. విజయవాడలో కుండపోత.. జనజీవనం అస్తవ్యస్తం
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం…
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 1, 2024
దేశవ్యాప్తంగా వానలు
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. IMD ప్రకారం.. ఆదివారం మేఘావృతమై ఉంటుంది. ఈ సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. IMD ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఆ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆయా రాష్ట్రాలకు కూడా వర్ష పరిస్థితులను బట్టి అధికారులు రెడ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.