Hydra : హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక విరామం
ఇప్పటికే తాము చాలా అక్రమ కట్టడాలను గుర్తించామనీ కాని.. వాటిని తొలగించే పనిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పారు.
- By Latha Suma Published Date - 01:26 PM, Mon - 2 September 24
Hydra: గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన పలు అక్రమ కట్టడాలను గుర్తించి హైడ్రా నేల మట్టం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వర్షాలు కురుస్తున్నా.. కూల్చివేతలను మాత్రం హైడ్రా ఆపలేదు. సెన్షేషన్‌గా మారింది. ఆయా నిర్మాణాలకు నోటీసులు ఇస్తూ కూల్చివేతలు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
అయితే.. తాజాగా హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కూల్చివేతలను ఆపేసింది. ఇప్పటికే తాము చాలా అక్రమ కట్టడాలను గుర్తించామనీ కాని.. వాటిని తొలగించే పనిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. వరద బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము కూల్చివేతలు కొనసాగించడం సరికాదని భావించి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఇక తమ బృందాలు జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని ఆయన రంగనాథ్ వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాకే ఆక్రమణల తొలగింపు మొదలుపెడతామని వెల్లడించారు. వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఇప్పటికే రంగనాథ్ పర్యటిస్తున్నారు. స్థానికులను అడిగి అక్కడి పరిస్థితికి కారణాన్ని తెలుసుకుంటున్నారు. చెరువుల పక్కన నిర్మించిన కాలనీలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలోని అక్రమ నిర్మాణాలకు ఇరిగేషన్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. త్వరగా ఇళ్లను ఖాళీ చేయాలంటూ నోటీసుల్లో పేర్కొంటున్నారు.
కాగా, హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటికే 200కు పైగా అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్టు తెలుస్తోంది. అందులో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఉంది. తర్వాత కేటీఆర్ జన్వాడా ఫామ్ హౌస్, అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి చెందిన ఇల్లు, ఆఫీసుకు కూడా హైడ్రా అధికారులు నోటీసులు అందజేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూల్చివేతల పనిలో హైడ్రా బిజీగా ఉండనుంది.
Read Also: Baldness : ఏ హార్మోను లోపం వల్ల పురుషులు బట్టతల బారిన పడుతున్నారు, నిపుణుల నుండి తెలుసుకోండి..!
Related News
HYDRA : మధ్యతరగతి కోపానికి.. హైడ్రా వెనక్కి తగ్గిందా..?
HYDRA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) అనేది హైదరాబాద్ , చుట్టుపక్కల సరస్సులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై దర్యాప్తు చేసే ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ.