IPL 2025: ఐపీఎల్ లో సీనియర్లకు పెరుగుతున్న ఆదరణ
లక్నో జహీర్‌ను మెంటార్‌గా చేర్చుకోవడంలో విజయవంతమైతే, ఆ జట్టుకు రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. జహీర్ చేరడం వల్ల జట్టు బ్రాండింగ్ పెరుగుతుంది. అంతేకాదు జట్టు బౌలింగ్‌ను బలోపేతం చేయడంలో అతను పాత్ర పోషిస్తాడు.
- By Praveen Aluthuru Published Date - 02:58 PM, Tue - 20 August 24

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారత కోచ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి కారణం వాళ్ళు సాధించిన విజయాలే. గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా మెంటార్ మరియు కోచ్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ఆధిపత్యం మరింత పెరిగింది. 2022 ఐపీఎల్ సీజన్లో ఆశిష్ నెహ్రా నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన సీజన్లో రన్నరప్ గా నిలిచింది. ఆ సీజన్లో గుజరాత్ పై చెన్నై విజయం సాధించి టైటిల్ నెగ్గింది.
2024లో కేకేఆర్ టైటిల్ విజయంలో మెంటర్ గౌతమ్ గంభీర్‌తో పాటు కోచ్ చంద్రకాంత్ పండిట్ కీలక పాత్ర పోషించారు. ఈ కారణంగా ఫ్రాంచైజీలు భారత కోచ్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి. జహీర్ ఖాన్‌తో పాటు రాహుల్ ద్రవిడ్ కూడా వచ్చే సీజన్‌లోపు కోచ్‌గా ఎంట్రీ ఇవ్వవచ్చు. ఆశిష్ నెహ్రా గుజరాత్ ని విడిచిపెట్టి మరొక జట్టులో చేరవచ్చు, యువరాజ్ సింగ్ కూడా కోచ్ లేదా మెంటార్‌గా చేరబోతున్నాడు. లక్నో కోచింగ్ సిబ్బంది మొదటి సీజన్ నుండి బలంగా కనిపిస్తుంది. 2022లో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా, ఆండీ ప్లోవర్ ప్రధాన కోచ్‌గా, మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా మరియు జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నారు. అయితే గంభీర్ కేకేఆర్ కి మెంటార్‌గా మారగా, ఫ్లవర్ ఆర్సీబీకి ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. మోర్కెల్ ఇప్పుడు భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
లక్నో జహీర్‌ను మెంటార్‌గా చేర్చుకోవడంలో విజయవంతమైతే, ఆ జట్టుకు రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. జహీర్ చేరడం వల్ల జట్టు బ్రాండింగ్ పెరుగుతుంది. అంతేకాదు జట్టు బౌలింగ్‌ను బలోపేతం చేయడంలో అతను పాత్ర పోషిస్తాడు. ప్రస్తుత ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ బ్యాటింగ్‌లో మాత్రమే ప్రత్యేకత చూపిస్తున్నాడు. జహీర్ చేరికతో జట్టు బ్యాటింగ్, బౌలింగ్ కూడా పటిష్టం కానుంది. ఆశిష్ నెహ్రాతో పాటు జహీర్ ఖాన్ చాలా కాలంగా భారత జట్టుకు ఆడాడు. ఈ స్టార్ బౌలర్లు టీమిండియాలో ఎన్ని అద్భుతలో సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో జహీర్ ముంబై ఇండియన్స్ కి సైతం సేవలు అందించాడు. మరి జహీర్ రాకతో లక్నో పేట్ మారుతుందని అనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి.
Also Read: Supreme Court : జడ్జీలు తీర్పుల్లో ప్రవచనాలు చెప్పొద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు