Yashasvi Jaiswal: జైశ్వాల్‌కు షాక్ ఇవ్వనున్న భారత్.. కారణమిదే?
నాగ్‌పూర్ వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఈ మ్యాచ్ లో జైస్వాల్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.
- By Gopichand Published Date - 02:34 PM, Fri - 7 February 25
Yashasvi Jaiswal: భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. విరాట్ కోహ్లి గాయం కారణంగా మొదటి వన్డేలో ఆడలేకపోయాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఓ వైపు అరంగేట్రం మ్యాచ్‌లో హర్షిత్ రాణా అద్భుత ప్రదర్శన కనబరచగా.. మరోవైపు యశస్వి జైస్వాల్‌కు అరంగేట్రం మ్యాచ్‌లో నిరాశ తప్పలేదు.
రెండో వన్డేకు యశస్వి జైస్వాల్ దూరం?
నాగ్‌పూర్ వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఈ మ్యాచ్ లో జైస్వాల్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అరంగేట్రం మ్యాచ్‌లో యశస్వి కేవలం 15 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఇప్పుడు రెండో వన్డే మ్యాచ్‌లో జైస్వాల్‌ను బెంచ్‌కే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: CM Chandrababu : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ
నిజానికి రెండో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి పునరాగమనం దాదాపు ఖరారైంది. ఇదే జరిగితే యశస్వి జైస్వాల్ ప్లేయింగ్ ఎలెవన్ నుండి బెంచ్‌కు పరిమితం కావడం ఖాయం. ఇటువంటి పరిస్థితిలో రోహిత్ శర్మ- శుభ్‌మన్ గిల్ మరోసారి వన్డే క్రికెట్‌లో టీమ్ ఇండియాకు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ నంబర్-3లో బ్యాటింగ్ చేస్తాడు. జైస్వాల్‌తో పాటే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ రాణా తనదైన శైలిలో అదరగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి సత్తా చాటాడు.
రెండో వన్డే మ్యాచ్ ఎక్కడ జరగనుంది?
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య వన్డే సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 9న కటక్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై అవుతుంది. ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ ఓడిపోతే టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇకపోతే ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది.