Teamindia Captain: గిల్‌కు బిగ్ షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్?
ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ తర్వాత ఆగస్టులో భారత్.. బంగ్లాదేశ్‌లో వైట్ బాల్ సిరీస్ (3 ODIలు, 3 T20Iలు) ఆడనుంది. ఈ సిరీస్ కోసం జట్టులో గణనీయమైన మార్పులు జరిగే అవకాశం ఉందని, కెప్టెన్సీపై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
- By Gopichand Published Date - 02:10 PM, Fri - 27 June 25

Teamindia Captain: టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. మొదటి టెస్టులో ఓడిపోయిన తర్వాత.. గిల్ అండ్ కో ఇప్పుడు రెండవ టెస్టును ఏ విధంగానైనా గెలిచి సిరీస్‌లో తిరిగి రావాలని కోరుకుంటోంది. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత ఆగస్టులో భారత్ వైట్ బాల్ సిరీస్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం జట్టులో భారీ మార్పులు చూడవచ్చని సమాచారం. కెప్టెన్ కూడా మారవచ్చనే చర్చలు జరుగుతున్నాయి. అయితే టెస్ట్ ఫార్మాట్‌తో పాటు వన్డే జట్టుకు కూడా గిల్‌నే కెప్టెన్‌గా చేయాలని బీసీసీఐ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ కెప్టెన్సీ లేని అనుభవం స్పష్టంగా కనిపించడంతో భారత్ జట్టు (Teamindia Captain) వన్డే ఫార్మాట్‌కు మరో కెప్టెన్‌ను ఎంపిక చేసే పనిలో పడింది బీసీసీఐ.
ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ తర్వాత ఆగస్టులో భారత్.. బంగ్లాదేశ్‌లో వైట్ బాల్ సిరీస్ (3 ODIలు, 3 T20Iలు) ఆడనుంది. ఈ సిరీస్ కోసం జట్టులో గణనీయమైన మార్పులు జరిగే అవకాశం ఉందని, కెప్టెన్సీపై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా భవిష్యత్తు కోసం జట్టును సిద్ధం చేయాలని BCCI లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Virat- Rohit: ఆస్ట్రేలియాలో విరాట్, రోహిత్ క్రేజ్.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!
శుభ్‌మన్ గిల్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ.. వైట్ బాల్ సిరీస్ కోసం కెప్టెన్ మారవచ్చని తెలుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ODI, T20I ఫార్మాట్‌లకు కెప్టెన్‌లుగా చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టెస్ట్ జట్టుకు గిల్, వన్డే జట్టుకు పాండ్యా, టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌లను ఫుల్ టైమ్ కెప్టెన్లుగా ఉంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు జట్టుకు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరూ ఉన్న సమయంలోనే జట్టును బలపర్చాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ప్రస్తుతం వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత వన్డే ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.