Kohli Retiring: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. కారణమిదేనా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 1-3 తేడాతో ఓటమి చవిచూసింది. విరాట్ కోహ్లీ తప్ప భారత జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లు నిరాశపరిచారు. విరాట్ కోహ్లీ పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.
- Author : Gopichand
Date : 10-05-2025 - 3:22 IST
Published By : Hashtagu Telugu Desk
Kohli Retiring: రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ముందే రిటైర్మెంట్ (Kohli Retiring) ప్రకటించాడు. రోహిత్ శర్మ ఇకపై భారత్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడడు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడనే చర్చలు ఊపందుకున్నాయి. ఎందుకంటే రోహిత్ లాగే విరాట్ ఇటీవలి టెస్ట్ ఫామ్ కూడా చెడ్డగా ఉంది. విరాట్‌తో కలిసి ఆడే ఒక ఆటగాడు ఇటీవల వెల్లడించిన విషయం ప్రకారం.. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ టెస్ట్ క్రికెట్‌తో విసిగిపోయానని చెప్పాడు.
విరాట్ కోహ్లీ పెద్ద హింట్ ఇచ్చాడు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు 1-3 తేడాతో ఓటమి చవిచూసింది. విరాట్ కోహ్లీ తప్ప భారత జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లు నిరాశపరిచారు. విరాట్ కోహ్లీ పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత అతని బ్యాట్ 8 ఇన్నింగ్స్‌లలో విఫలమైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. భారత జట్టు ఆటగాడు ఒకరు విరాట్ కోహ్లీ గురించి చెబుతూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు విరాట్ పలుమార్లు టెస్ట్ క్రికెట్‌తో విసిగిపోయానని చెప్పాడని వెల్లడించాడు. అయితే ఆ సమయంలో భారత జట్టు ఆటగాళ్లు విరాట్ మాటలను సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే కోహ్లీ, భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో చెడు పరిస్థితిలో ఉన్నారు. కోహ్లీ ఈ పర్యటనలో 5 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌లలో కేవలం 190 రన్స్ మాత్రమే చేశాడు.
మీడియా నివేదికల ప్రకారం.. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో అతను బీసీసీఐని కూడా సంప్రదించాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత బీసీసీఐ అతనికి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి సమయం ఇచ్చిందని సమాచారం. బీసీసీఐతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ విరాట్ కోహ్లీని ఇంగ్లండ్ పర్యటనకు పంపాలని కోరుకుంటోంది. ఎందుకంటే అతను భారత జట్టులో అత్యంత ముఖ్యమైన ఆటగాడు. విరాట్ టెస్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లండ్ గడ్డపై గణనీయమైన రన్స్ సాధించాడు.