Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ తర్వాత!
ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కి ముందు విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు. అతని మంచి ప్రదర్శన భారత జట్టుకు కూడా మేలు చేస్తుంది.
- By Gopichand Published Date - 03:02 PM, Fri - 10 January 25

Virat Kohli: ఇటీవల భారత్-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో కోహ్లీ (Virat Kohli) తన ఫామ్‌తో పేలవ ప్రదర్శన చేశాడు. ఇప్పుడు టెస్టు క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో భారత్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కౌంటీ క్రికెట్‌లో ఆడాలని విరాట్ కోహ్లీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు సిద్ధమవుతాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ కౌంటీల్లో ఆడనున్నాడు. తద్వారా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను చక్కగా మలచుకొని తన టెక్నిక్‌పై పని చేయగలుగుతాడని తెలుస్తోంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 మొదటి సిరీస్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా భారత్ తొలి సిరీస్‌ను ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది. అది కూడా ఇంగ్లిష్ పరిస్థితుల్లో ఆడుతుంది. దీంతో భారత్ అందుకు సంబంధించిన సన్నాహాల్లో బిజీగా ఉంది. గత ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి అద్భుత ప్రదర్శన చేశాడు. అదే సిరీస్‌లో భారత్‌కు ఆధిక్యం లభించింది. అయితే చివరకు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ డ్రాగా ముగిసింది. విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌లో 16 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 47.32 సగటుతో 1315 పరుగులు చేశాడు. 2018లో ఇంగ్లాండ్ పర్యటనలో 593 పరుగులు చేశాడు. కానీ 2021 పర్యటన కోహ్లీకి కలిసిరాలేదు.
Also Read: CII National Council Meeting : మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
విరాట్ కోహ్లీ ఏ జట్టుతో ఆడగలడు?
ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కి ముందు విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు. అతని మంచి ప్రదర్శన భారత జట్టుకు కూడా మేలు చేస్తుంది. సర్రే లేదా యార్క్‌షైర్ వంటి పెద్ద కౌంటీ జట్లలో ఒకదానిలో కోహ్లీ చేరగలడని సమాచారం. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు కౌంటీ క్రికెట్‌లో ఆడారు. దీంతో వారి ఆటలోనూ మెరుగుదల కనిపించింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా అదే బాటలో నడుస్తున్నాడు.