CII National Council Meeting : మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
స్కిల్ యూనివర్సిటీలో భాగస్వాములు అవుతామని సీఐఐ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని డీజిల్ వాహనాలను.. ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తాం అని తెలిపారు.
- By Latha Suma Published Date - 02:56 PM, Fri - 10 January 25

CII National Council Meeting : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ హైటెక్ సిటీ లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం గ్రీన్ బిజినెస్ సెంటర్ లో మొక్క నాటారు. అనంతరం స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధి గురించి సీఐఐ ప్రతినిధులతో చర్చించారు. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వాములు అవుతామని సీఐఐ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని డీజిల్ వాహనాలను.. ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తాం అని తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని డీజిల్ వాహనాలను.. ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తాం అని తెలిపారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ సోలాల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఫోర్త్ సిటీనీ ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించబోతుందని తెలిపారు. కాలుష్య నివారణకు 3,200 వేల ఈవీ బస్సులు తెచ్చామని.. ఈవీ వాహనాలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేసన్ పన్నులను మినహాయించామన్నారు. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కాలుష్యకారక వాహనాలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తున్నాం. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.
చంద్రమండలానికి వెళ్తున్నాం.. కానీ భూమిపై ఎలా ఉండాలో మాత్రం తెలుసుకోలేకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నం పోర్ట్ ను అనుసంధానం చేస్తు రోడ్డు, రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రీజనల్ రింగ్ రైల్వే లైన్ మంజూరు చేయాలని ప్రధాని మోడీ ని కోరామని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేయించాం. మహిళా సంఘాలతో సోలార్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నాం. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఆటో మొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాం. హైటెక్ సిటీ పక్కనే మహిళా సంఘాల ఉత్పత్తులను విక్రయించు కునేందుకు మూడున్నర ఎకరాల స్థలంలో స్టాల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మొటిక్ ఛార్జీలు ను పెంచాం. మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం.