Virat Kohli: గంభీర్ రిక్వెస్ట్ కు ఓకే లంకతో వన్డే సిరీస్ కు కోహ్లీ
లంకతో వన్డే సిరీస్ లో సీనియర్లు ఆడాలని గంభీర్ సెలక్టర్లకు కాస్త గట్టిగానే చెప్పాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం వెంటనే అంగీకరించాడు. తాజాగా విరాట్ కోహ్లీ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. లంకతో మూడు వన్డేల సిరీస్ కు ఆడతానని కోహ్లీ సెలక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది.
- By Praveen Aluthuru Published Date - 06:26 PM, Thu - 18 July 24

Virat Kohli: భారత క్రికెట్ జట్టు వచ్చే వారం శ్రీలంక పర్యటనకు వెళ్ళబోతోంది. ఇప్పటికే జట్టు ఎంపికలో కొత్త కోచ్ గంభీర్ బిజీగా ఉన్నాడు. సుధీర్ఘ లక్ష్యాలతో బాధ్యతలు చేపట్టిన గంభీర్ కు కోచ్ గా లంక టూర్ మొదటిది. దీంతో అన్ని విషయాల్లోనూ ఇటు బీసీసీఐ, అటు సెలక్టర్లతో ఖచ్చితంగా ఉంటున్నాడు. ఇక్కడ నుంచి భారత కోచ్ గా తనదైన ముద్ర వేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. కాగా లంకతో వన్డే సిరీస్ లో సీనియర్లు ఆడాలని గంభీర్ సెలక్టర్లకు కాస్త గట్టిగానే చెప్పాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం వెంటనే అంగీకరించాడు. తాజాగా విరాట్ కోహ్లీ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. లంకతో మూడు వన్డేల సిరీస్ కు ఆడతానని కోహ్లీ సెలక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఫ్యామిలీతో లండన్ లో వెకేషన్ లో ఉన్న విరాట్ త్వరలోనే స్వదేశానికి తిరిగి రానున్నాడు. నిజానికి లంక టూర్ లో సీనియర్ ప్లేయర్స్ అందరికీ రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. రానున్న బిజీ సీజన్ దృష్ట్యా యువ క్రికెటర్లనే లంకను పంపాలని భావించింది.
అయితే కొత్త కోచ్ గంభీర్ మాత్రం సీనియర్లు ఆడాలని రిక్వెస్ట్ చేశాడు. దీనికి కారణాలు లేకపోలేదు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే గంభీర్ మొదటి టార్గెట్. దీని కోసం జట్టు కూర్పుపై అంచనాకు రావాలంటే ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని చెబుతున్నాడు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే వన్డే సిరీస్ లు రెండే ఉన్నాయి. అందుకే శ్రీలంక బలహీనంగానే ఉన్నప్పటకీ జట్టు కూర్పుపై స్పష్టత తెచ్చుకునేందుకు రోహిత్, విరాట్ లను ఆడమని కోరాడు. దీనికి ఇద్దరూ అంగీకరించడంతో లంకతో సిరీస్ లో సీనియర్లను చూడబోతున్నాం. అయితే బూమ్రా ఒక్కడే ఈ టూర్ కు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తోంది. రొటేషన్ పధ్ధతిలో అతనికి రెస్ట్ ఇచ్చేందుకు గంభీర్ కూడా అంగీకరించినట్టు సమాచారం. మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత్.. శ్రీలంకలో పర్యటించనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరుగనుండగా… తర్వాత ఇరు జట్లు ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్నాయి.
Also Read: Katrina Kaif : వాటితోనే కోట్లు సంపాదిస్తున్న కత్రినా.. ఇక సినిమాలు ఎందుకు..?