T20 World Cup : చరిత్ర సృష్టించిన టీమిండియా..సినీ ప్రముఖుల రియాక్షన్ ఇలా..!!
- Author : Vamsi Chowdary Korata
Date : 09-03-2026 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు కూడా జట్టుకు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి జట్టు చూపించిన పట్టుదల, టీమ్‌వర్క్‌ను ప్రశంసిస్తూ దేశాన్ని గర్వపడేలా చేసిన విజయమని పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను కొనియాడుతూ ఈ విజయం 140 కోట్ల భారతీయులకు ఆనందం తెచ్చిందన్నారు. దర్శకుడు రాజమౌళి, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు.
టీమిండియా మరోసారి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటింది. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై అద్భుత విజయాన్ని సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్‌లో ఏకపక్షంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను (2024, 2026) గెలుచుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. మొత్తం మీద టీమిండియాకు ఇది మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలుగు సినీ సెలబ్రెటీలు కూడా ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ టీమిండియాపై ప్రశంసలు కురిపించారు.
Congratulations to Team India on lifting the T20 World Cup 2026!
A remarkable journey filled with grit, passion and outstanding teamwork throughout the tournament.
A truly memorable victory that has made the entire nation proud! 👏💐
Jai hind 🇮🇳 #TeamIndia #T20WorldCup2026 pic.twitter.com/4DIrRs8XOv
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 8, 2026
మెగాస్టార్ చిరంజీవి టీమిండియాకు అభినందనలు తెలుపుతూ ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. టోర్నమెంట్ మొత్తం జట్టు చూపించిన పట్టుదల, టీమ్‌వర్క్ అద్భుతమని పేర్కొంటూ దేశాన్ని గర్వపడేలా చేసిన విజయమని అన్నారు. “జై హింద్” అంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా టీమిండియా విజయాన్ని ప్రశంసించారు. ఆటగాళ్లు చూపించిన ఆత్మవిశ్వాసం, ఆధిపత్యం గొప్పదని పేర్కొన్నారు. సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్, దూబే, బుమ్రా, అక్షర్ వంటి ఆటగాళ్ల ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం 140 కోట్ల భారతీయుల హృదయాలను ఆనందంతో నింపిందని ఆయన పేర్కొన్నారు.
What was that!!! 🤯🤯🤯
A magnificent testimony to Team India’s dominance unleashing full beast mode to bring it home for 1.4 billion hearts…😍😍😍Exemplary performances from Samson, Abhishek, Ishan, Dube , Bumrah, Axar and everyone who made this unforgettable…. Congratulations… pic.twitter.com/1S6vZx17vM— Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2026
This is how our Men in Blue showed up with calm, composure and dominance throughout the tournament … and brought the trophy home again and created history… Congratulations Team India 🇮🇳. The nation will sleep well tonight.
— Jr NTR (@tarak9999) March 8, 2026
CHAMPIONS. AGAIN. 💪🏻💪🏻💪🏻
Sanju, Bumrah, Dube, Ishan 👏🏻👏🏻👏🏻👏🏻What a solid performance.
Salute to Team India! JAI HIND. 🇮🇳
— rajamouli ss (@ssrajamouli) March 8, 2026
ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. సంజూ శాంసన్, బుమ్రా, దూబే, ఇషాన్ వంటి ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని పేర్కొంటూ “ మళ్లీ ఛాంపియన్స్!” అంటూ జట్టుకు సెల్యూట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్ మొత్తం భారత జట్టు చూపించిన శాంతం, ఆత్మవిశ్వాసం, ఆధిపత్యం గొప్పదని అన్నారు. మరోసారి ట్రోఫీని దేశానికి తీసుకువచ్చి చరిత్ర సృష్టించినందుకు జట్టును అభినందించారు. ఇంకా ఎంతోమంది సెలబ్రెటీలు టీమిండియా విజయం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.
Hearty congratulations to #TeamIndia for their magnificent victory over New Zealand in the ICC T20 World Cup final and for winning the World Cup for the third time.
I congratulate Captain @surya_14kumar for leading the team brilliantly. Special congratulations to India’s… pic.twitter.com/sG5sog84zy
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 8, 2026
ఏపీ డిప్యూటీ సీఎం, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా టీమిండియా విజయంపై స్పందించారు.. ఈ మేరకు ఆయన స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు.
న్యూజిలాండ్‌పై ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత విజయం సాధించి మూడోసారి ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. జట్టును అద్భుతంగా నడిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ప్రత్యేక అభినందనలు. టోర్నమెంట్ మొత్తం అద్భుత ప్రదర్శనతో తన ప్రతిభను చాటిన భారత వికెట్‌కీపర్ సంజూ శాంసన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో నిలిచిన జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిలకు ప్రత్యేక అభినందనలు. అలాగే జట్టును విజయపథంలో నడిపించేందుకు మార్గనిర్దేశం చేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మొత్తం సహాయక సిబ్బందికి కూడా అభినందనలు. ఈ విజయం 140 కోట్ల భారతీయుల హృదయాలను గర్వంతో, ఆనందంతో నింపింది. భవిష్యత్తులో కూడా జట్టు మరెన్నో విజయాలు సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలమైన స్కోర్ అందించారు. ఆయన 89 పరుగులతో జట్టును ముందుండి నడిపించారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మెరుపు హాఫ్ సెంచరీలతో జట్టు భారీ స్కోరు సాధించడంలో సాయపడ్డారు. మరోవైపు బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. బుమ్రాతో పాటు అక్షర్ పటేల్ పదునైన బౌలింగ్‌తో కివీస్‌ని చుట్టేశారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం సాధించింది.
ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయంగా నిలిచింది. 2007లో పాకిస్థాన్‌పై విజయం సాధించి తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్, ఆ తర్వాత 2024లో వెస్టిండీస్ – అమెరికాలో జరిగిన టోర్నీలో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి విజేతగా నిలిచింది. ఇప్పుడు 2026లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి మూడోసారి ప్రపంచకప్‌ను అందుకుంది. ముఖ్యంగా వరుసగా రెండు టోర్నీల్లో టైటిల్ సాధించడం భారత జట్టు స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనంగా నిలిచింది. టీమిండియా విజయం తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అభిమానులు వీధుల్లోకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. పటాకులు కాల్చుతూ, జాతీయ జెండాలు ఊపుతూ అభిమానులు టీమిండియా విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. మొత్తంగా టీమిండియా మరోసారి ప్రపంచకప్ గెలవడం దేశవ్యాప్తంగా ఆనందాన్ని పంచగా, సినీ ప్రముఖుల అభినందనలతో ఈ విజయోత్సవం మరింత ప్రత్యేకంగా మారింది.