HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Star Batsmen Have Not Won The Orange Cap In Ipl History

Orange Cap In IPL: ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలవని స్టార్ బ్యాటర్లు!

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ మాత్రమే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్‌లో స్టార్స్‌గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టాడు.

  • Author : Gopi Date : 14-12-2024 - 2:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL 2025 Final
IPL 2025 Final

Orange Cap In IPL: ఐపీఎల్ ధనాధన్ లీగ్ (Orange Cap In IPL) కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేలం ప్రక్రియ ముగిసింది. సాధారణంగానే ఈ లీగ్‌లో బ్యాట్స్‌మెన్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ లీగ్లో బౌలర్లు సైతం బౌన్దరీలు బాదుతుంటారు. మరి బాటర్లు ఇంకెంత రెచ్చిపోతారో తెలిసిందే. కాగా ఐపీఎల్ లో ప్రభావం చూపించిన ఆటగాళ్లను క్యాప్ లతో సత్కరిస్తారు. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు ఆరెంజ్ క్యాప్ ప్రధానం చేస్తారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లకు పర్పుల్ క్యాప్ లభిస్తుంది.

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ మాత్రమే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్‌లో స్టార్స్‌గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ రికార్డులు కొల్లగొట్టాడు. ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. కానీ రోహిత్ ఐపీఎల్ లో ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. రోహిత్ శర్మ 257 ఐపీఎల్ మ్యాచ్‌లలో 131.14 స్ట్రైక్ రేట్‌తో 6628 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు మరియు 43 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ జాబితాలో ధోనీ కూడా ఉండటం విశేషం. ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. ధోనీ అత్యుత్తమ ఫినిషర్‌గా ఎన్నో మ్యాచ్ లను గెలిపించాడు. అయితే మాహీ ఒక్కసారి కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. ధోనీ 264 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 137.54 స్ట్రైక్ రేట్‌తో 5243 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 24 అర్ధ సెంచరీలు సాధించాడు.

Also Read: AP Irrigation Election: నేడు ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు.. ఎన్నికలను బహిష్కరించిన వైకాపా పార్టీ?

మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా చాలా కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా రైనా తన ఐపీఎల్ కెరీర్‌ను ముగించాడు. రైనా ప్లేఆఫ్‌లు మరియు ఫైనల్స్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కానీ సురేష్ రైనా కూడా ఒక్క ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. రైనా 205 ఐపీఎల్ మ్యాచ్‌లలో 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Chris Gayle
  • Indian Premier League
  • Indian Premier League 2025
  • IPL
  • IPL 2025
  • MI
  • Orange Cap In IPL
  • rcb
  • rohit sharma
  • virat kohli

Related News

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd