Sports Lookback 2024: ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆటగాళ్లు వీరే!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దానికి అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అదే సమయంలో తాను టీ20 క్రికెట్ ఆడనని రిటైర్మెంట్ ప్రకటించాడు.
- By Gopichand Published Date - 08:37 PM, Tue - 17 December 24

Sports Lookback 2024: 2024 సంవత్సరంలో (Sports Lookback 2024) క్రికెట్ ప్రపంచం చాలా మంది పెద్ద, దిగ్గజ ఆటగాళ్లకు వీడ్కోలు చెప్పారు. ఈ ఆటగాళ్లు తమ కెరీర్‌లో అద్భుత ప్రదర్శన చేసి క్రికెట్ ప్రపంచంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారి రిటైర్మెంట్ పట్ల క్రికెట్ ప్రేమికులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే వారి విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 2024లో రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ కెరీర్‌ని ముగించిన ప్రముఖ ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శిఖర్ ధావన్
భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ ఈ ఏడాది క్రికెట్‌కు నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టులో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. పునరాగమనం కోసం ప్రయత్నించాడు. కానీ విజయం సాధించలేదు. కాబట్టి అతను రిటైర్మెంట్ నిర్ణయించుకున్నాడు.
విరాట్ కోహ్లీ
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దానికి అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అదే సమయంలో తాను టీ20 క్రికెట్ ఆడనని రిటైర్మెంట్ ప్రకటించాడు.
రోహిత్ శర్మ
T20 వరల్డ్ కప్ 2024 విజేత కెప్టెన్ రోహిత్ శర్మ టైటిల్ గెలిచిన తర్వాత T20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు వన్డే, టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు.
Also Read: Virat Kohli’s Bat: ఫాలోఆన్‌ను తప్పించుకున్న భారత్.. కోహ్లీ సాయం కూడా ఉందండోయ్!
రవీంద్ర జడేజా
విరాట్, రోహిత్ తర్వాత రవీంద్ర జడేజా కూడా టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత అతని నిర్ణయం వెలువడింది. ఇప్పుడు వన్డే, టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు.
వార్నర్
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది క్రికెట్‌కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్ తన చివరి టోర్నీ అని అతను చెప్పాడు. అదే జరిగింది. ఇప్పుడు అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడడం లేదు.
దినేష్ కార్తీక్
భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ కూడా ఈ ఏడాది క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. IPL-2024 తన చివరి IPL అని అతను చెప్పాడు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మెంటార్‌గా మారాడు.
జేమ్స్ ఆండర్సన్
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఈ ఏడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను ఇంగ్లాండ్ వేసవిలో పదవీ విరమణ తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో ఉన్నాడు.
మొయిన్ అలీ
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఈ ఏడాది క్రికెట్‌కు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు అతను లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. కానీ ఈసారి అతను IPL వేలంలో అమ్ముడుపోలేదు. న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ కూడా ఇటీవల క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు.