HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Shreyas Iyer Turned The Match Around With A Stunning Catch

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 17-04-2026 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pulled back the catch Shreyas Iyer
Pulled back the catch Shreyas Iyer

వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్యాచ్ చూసి ముంబై ఇండియన్స్ డగౌట్‌లో ఉన్న రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నోరెళ్లబెట్టారు. దీన్ని ఈ ‘సీజన్ బెస్ట్ క్యాచ్’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 18వ ఓవర్ బౌలింగ్ చేయడానికి మార్కో జాన్సెన్ వచ్చాడు. ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఓ భారీ షాట్‌కు ప్రయత్నించగా, బంతి లాంగ్-ఆన్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్, తన ఎడమవైపుకు వేగంగా పరుగెత్తి బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు.

అయితే, బ్యాలెన్స్ కోల్పోయి తాను బౌండరీ లైన్ దాటి వెళ్తున్నానని గ్రహించిన అయ్యర్, గాల్లో ఉండగానే అసాధారణ సమయస్ఫూర్తితో బంతిని మైదానం లోపలికి విసిరాడు. సమీపంలోనే ఉన్న మరో ఫీల్డర్ జేవియర్ బార్ట్‌లెట్ ఆ బంతిని అందుకోవడంతో క్యాచ్ పూర్తయింది. దీంతో హార్దిక్ (14) నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఈ ఊహించని ఫీల్డింగ్ విన్యాసానికి ముంబై డగౌట్‌లోని రోహిత్, సూర్యకుమార్ అవాక్కయ్యారు. శ్రేయస్ క్యాచ్ పట్టిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ క్యాచ్ పంజాబ్ కింగ్స్‌కు కీలక సమయంలో వికెట్ అందించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2026
  • mumbai indians
  • punjab kings
  • rohit sharma
  • shreyas iyer
  • Suryakumar Yadav
  • Suryakumar Yadav (SKY)
  • Wankhede Stadium

Related News

    Latest News

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

    • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd