HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Shreyas Iyer Names Captain Mumbai

టీమ్ ఇండియాలోకి శ్రేయస్ అయ్యర్ పునరాగమనం.. కెప్టెన్‌గా ఎంపిక!

శ్రేయస్ అయ్యర్ భారత జట్టు స్క్వాడ్‌లోకి ఎంపికైనప్పటికీ ఆయన ఫిట్‌నెస్ ఇంకా కీలకంగా మారింది. ఒకవేళ BCCI CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) నుండి అనుమతి లభించకపోతే ఆయన వన్డే సిరీస్‌లో ఆడలేరు.

  • Author : Gopichand Date : 05-01-2026 - 5:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shreyas Iyer
Shreyas Iyer

Shreyas Iyer: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించారు. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టులోకి తిరిగి వచ్చారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో గాయపడిన తర్వాత ఆయన కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యారు. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఆయనను మళ్ళీ ఎంపిక చేశారు. ఈ కమ్‌బ్యాక్ తర్వాత అయ్యర్‌కు మరో శుభవార్త అందింది. విజయ్ హజారే ట్రోఫీలో తదుపరి రెండు మ్యాచ్‌లకు ఆయన ముంబై జట్టుకు కెప్టెన్సీ వహించనున్నారు.

విజయ్ హజారే ట్రోఫీలో సారథిగా అయ్యర్

ముంబై ప్రస్తుత కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ కాలి పిక్క గాయం కారణంగా టోర్నమెంట్ నుండి తప్పుకున్నారు. ఆయన స్థానంలో అయ్యర్ లీగ్ స్టేజ్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. దీనిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కార్యదర్శి డాక్టర్ ఉన్మేష్ ఖాన్విల్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన లీగ్ స్టేజ్ మ్యాచ్‌లకు ముంబై సీనియర్ మెన్స్ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరిస్తారని ప్రకటించడానికి MCA సంతోషిస్తోంది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని అయ్యర్ భర్తీ చేస్తారని తెలిపారు.

Also Read: జన నాయకుడు మూవీ ఎఫెక్ట్‌తో మ‌ళ్లీ ట్రెండింగ్‌లోకి భ‌గ‌వంత్ కేసరి..

శ్రేయస్ అయ్యర్ మ్యాచ్‌ల షెడ్యూల్

విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో ముంబై తన తదుపరి రెండు మ్యాచ్‌లను హిమాచల్ ప్రదేశ్- పంజాబ్‌లతో ఆడనుంది. జనవరి 6న‌ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్. ఇది అయ్యర్ కమ్‌బ్యాక్ మ్యాచ్. జనవరి 8న పంజాబ్‌తో మ్యాచ్. ఇది లీగ్ స్టేజ్‌లో ముంబైకి చివరి మ్యాచ్.

ఫిట్‌నెస్ నిరూపించుకుంటేనే టీమ్ ఇండియాలోకి

శ్రేయస్ అయ్యర్ భారత జట్టు స్క్వాడ్‌లోకి ఎంపికైనప్పటికీ ఆయన ఫిట్‌నెస్ ఇంకా కీలకంగా మారింది. ఒకవేళ BCCI CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) నుండి అనుమతి లభించకపోతే ఆయన వన్డే సిరీస్‌లో ఆడలేరు. అటువంటి పరిస్థితుల్లో ఆయన స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం అయ్యర్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నార. కాబట్టి ఇక్కడ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటే మూడు నెలల విరామం తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో బరిలోకి దిగుతారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • Ind vs NZ
  • indian cricket team
  • mumbai
  • shreyas iyer
  • sports news

Related News

Faf Du Plessis

టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!

టీ-20 క్రికెట్ చరిత్రలో 12 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా ఫాఫ్ డు ప్లెసిస్ నిలిచారు. ఇప్పటివరకు మరే ఇతర దక్షిణాఫ్రికా ఆటగాడు కూడా ఈ మైలురాయిని అందుకోలేకపోయారు.

  • Rishabh Pant

    కివీస్‌తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!

  • Bangladesh

    బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

  • Vaibhav Suryavanshi

    వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 63 బంతుల్లోనే సెంచ‌రీ!

  • Arjun Tendulkar

    సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

Latest News

  • విశాఖ తీరంలో మిస్సైల్ టెస్ట్!

  • అశ్లీల కంటెంట్ వివాదం, గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!

  • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

  • సంక్రాంతి వేళ, APSRTC లో సమ్మె సైరన్ ?

  • అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

Trending News

    • డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

    • కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd