Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ టీ20 కెరీర్ ముసిగినట్టేనా?
శ్రీలంకతో జరిగిన వన్డేలో అయ్యర్ తీవ్రంగా నిరుత్సాహపర్చాడు. తొలి వన్డేలో 23 పరుగులు చేసిన చేసిన అయ్యర్.. మిగిలిన రెండు వన్డేల్లో కలిపి 15 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా సిరీస్‌లో 38 రన్స్ చేశాడు. అయ్యర్ వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లి ఉంటే సిరీస్‌లో రిజల్ట్ మరోలా ఉండేది. నిరూపించుకోవాల్సిన సమయంలో అయ్యర్ పేలవ ప్రదర్శన తన కెరీర్ని ఇబ్బంది పెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 03:27 PM, Sat - 10 August 24

Shreyas Iyer: ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా టీమిండియా కితాబు అందుకుంటున్న తరుణంలో శ్రీలంక చేతిలో ఓడి రోహిత్ సేన విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా బ్యాటింగ్ దళం ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. శ్రీలంక స్పిన్నర్ల ఇచ్చులో చిక్కుకుని బయటకు రాలేకపోయారు. ఫలితంగా 27 ఏళ్ళ తర్వాత శ్రీలంక టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే ఈ ఘోర పరాభవం టీమిండియా భవిష్యత్తుపై పెద్దగా ప్రభావం చూపించకపోయినా..శ్రేయస్ అయ్యర్ కెరీర్ డేంజర్లో పడబోతున్నట్లు తెలుస్తుంది.
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అయ్యర్ తీవ్రంగా నిరుత్సాహపర్చాడు. తొలి వన్డేలో 23 పరుగులు చేసిన చేసిన అయ్యర్.. మిగిలిన రెండు వన్డేల్లో కలిపి 15 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా సిరీస్‌లో 38 రన్స్ చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జట్టును విజయతీరాలకు చేర్చే అవకాశం ఉంటుంది. టాపార్డర్ ఆరంభం అందిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మిడిల్ లో వచ్చే వారిపైనే ఉంటుంది. కానీ అయ్యర్ జట్టుకి ఏమీ చేయలేకపోయాడు. అయ్యర్ వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లి ఉంటే సిరీస్‌లో రిజల్ట్ మరోలా ఉండేది. నిరూపించుకోవాల్సిన సమయంలో అయ్యర్ పేలవ ప్రదర్శన తన కెరీర్ని ఇబ్బంది పెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
వాస్తవానికి టి20 ఫార్మెట్లో అయ్యర్ కి స్థానం దక్కపోవచ్చు. మిగతా ఫార్మేట్లకు అయ్యర్ సెలెక్ట్ అయినా ఈ కాలంలో వన్డే సిరీస్ లు లేవు. టీమిండియా వన్డే సిరీస్ ఆడాలంటే కనీసం ఆర్నెల్ల సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో టీ20లు, టెస్టులు మాత్రమే జరగనున్నాయి.టెస్టుల్లోనూ అతడ్ని ఆడిస్తారనే గ్యారెంటీ లేదు. దీంతో అయ్యర్ కి వన్డే టీమ్‌లో బెర్త్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరి గంభీర్ అయ్యర్ ని కన్సిడర్ చేస్తాడో లేదో చూడాలి.
Also Read: Coffee Health Benefits: మితిమీరిన కాఫీ వద్దు.. హెచ్చరిస్తున్న నిపుణులు