Bengaluru Win: చెలరేగిన సాల్ట్, విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ ఖాతాలో మరో విజయం!
ఫిల్ సాల్ట్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ దేవదత్ పడిక్కల్‌తో 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి బెంగళూరు విజయాన్ని ఖాయం చేశాడు. కోహ్లీ 62 పరుగులు చేయగా, పడిక్కల్ 28 బంతుల్లో 40 పరుగులు సాధించాడు.
- By Gopichand Published Date - 07:56 PM, Sun - 13 April 25

Bengaluru Win: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రాజస్థాన్ రాయల్స్ (RR)ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సొంత మైదానం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ ఘోర ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 173 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా బెంగళూరు (Bengaluru Win) 18వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని సాధించింది. RCB విజయంలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కీలక పాత్ర పోషించారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు.
RCB సునాయాస విజయం
174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో RCBకి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ 92 పరుగుల గొప్ప ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాల్ట్ కేవలం 33 బంతుల్లో 65 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
Also Read: Rooh Afza Vs Patanjali : షర్బత్ బిజినెస్.. రూహ్ అఫ్జాతో పతంజలి ఢీ
ఫిల్ సాల్ట్ ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ దేవదత్ పడిక్కల్‌తో 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి బెంగళూరు విజయాన్ని ఖాయం చేశాడు. కోహ్లీ 62 పరుగులు చేయగా, పడిక్కల్ 28 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. రాజస్థాన్ తరపున 7 మంది బౌలర్లు బౌలింగ్ చేశారు. కానీ కుమార్ కార్తికేయ మాత్రమే ఒక వికెట్ తీయగలిగాడు.
యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ
రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసింది, ఇందులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జైస్వాల్ 47 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ 35 పరుగులు, రియాన్ పరాగ్ 30 పరుగులు సాధించారు. అయితే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అద్భుతమైన బ్యాటింగ్ బెంగళూరు విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 4 విజయాలు సాధించింది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఈ జట్టు ఇప్పుడు పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో నిలిచింది.