Rohit Sharma: టీమిండియా ప్లేయర్స్ ని ఇమిటేట్ చేసిన రోహిత్ శర్మ
సహచర ఆటగాళ్లను ఇమిటేట్ చేయడంలో రోహిత్ ముందుంటాడు. ఆ మధ్య శ్రేయాస్ అయ్యర్ ని ఇమిటేట్ చేసిన వీడియో ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెల్సిందే.
- Author : Praveen Aluthuru
Date : 27-01-2024 - 7:46 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: ఆన్ ఫీల్డ్ లో ఎంత సీరియస్ గా కనిపిస్తాడో ఆఫ్ ఫీల్డ్ లో అంతే జోయల్ గా కనిపిస్తాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. సహచర ఆటగాళ్లను ఇమిటేట్ చేయడంలో రోహిత్ ముందుంటాడు. ఆ మధ్య శ్రేయాస్ అయ్యర్ ని ఇమిటేట్ చేసిన వీడియో ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెల్సిందే.
తాజాగా హిట్ మ్యాన్ మరో వీడియోతో మన ముందుకొచ్చాడు. తనలో ఓ నటుడున్నాడని ప్రూవ్ చేశాడు. యాంకర్ సరదా సరదాకే ఇమిటేట్ చెయ్యమని అడిగితే.. చూసుకో మల్ల అంటూ రోహిత్ ఇమిటేట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్‌తో పాటు మాజీ స్టార్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్‌ను కూడా ఇమిటేట్ చేశాడు.
వీడియో గమనిస్తే.. ధోని హెలికాప్టర్ షాట్, సచిన్ అప్పర్ కట్, సూర్య షాట్ ఎలా కొడతాడో ఇమిటేట్ చేశాడు. అయితే వీడియోలో కోహ్లీ సెలబ్రేషన్స్, బుమ్రా బౌలింగ్ యాక్షన్ హైలైట్ గా నిలిచింది. ఎగ్జాగ్ట్గా ఇద్దర్నీ దించేశాడు. సెలబ్రేషన్స్ టైమ్‌లో విరాట్ ఎలా అరుస్తాడో చూపించాడు. ఇది చూస్తే మాత్రం నవ్వాపుకోలేరు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ ఇమిటేషన్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రోహిత్ శర్మ ఇమిటేట్ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. రోహిత్ కు ఆస్కార్ ఇచ్చినా తప్పు లేదని ఒకరు పోస్ట్ పెట్టారు. క్రికెట్ కి వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ కి యాక్టింగ్ ఒక ఆప్షన్ ఉందంటున్నారు. ఏదేమైనా ఎప్పుడు నవ్వుతు, నవ్విస్తుందే రోహిత్ శర్మను ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత తన కళ్ళలో నీళ్లు చూసిన ఫాన్స్ తట్టుకోలేకపోయారు. చాన్నాళ్ల తర్వాత రోహిత్ మళ్ళీ నవ్వుతు కనిపిస్తుండటం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Wait for Kohli and MSD 🤣#RohitSharma pic.twitter.com/iTDoOlxzah
— ICT 💙 (@ROHIRAT_) January 26, 2024
Also Read: Pushpa 2 Release Date: పుష్ప 2 రిలీజ్ పుకార్లను నమ్మొద్దు: మైత్రీ మూవీ మేకర్స్