అభిమానులు పై ఫైర్ అయిన రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో!
- Author : Vamsi Chowdary Korata
Date : 05-01-2026 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
Young Fans Misbehave With Rohit Sharma కారులో ప్రయాణిస్తున్న టీమిండియా స్టార్ రోహిత్ శర్మను ఇద్దరు యువ అభిమానులు అడ్డుకుని సెల్ఫీకి ప్రయత్నించారు. వారి అతి ప్రవర్తనతో అసహనానికి గురైన రోహిత్, వారిని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన రోహిత్, త్వరలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు. 2025 సంవత్సరం రోహిత్ శర్మకు ఎన్నో రికార్డులను అందించింది. 2025లో 14 ఇన్నింగ్స్‌లలో 650 పరుగులు చేశాడు.
- కారులో ప్రయాణిస్తున్న రోహిత్ శర్మ
- సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన అభిమానులు
- యంగ్ ఫ్యాన్ అతి ప్రవర్తనతో హిట్‌మ్యాన్ అసహనం
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు లోపల ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరు యువ అభిమానులు రోహిత్‌ను అడ్డుకున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన ఓ అభిమాని చేసిన పనికి రోహిత్ శర్మ అసహనానికి గురయ్యి, ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అభిమానులను చూసి రోహిత్ కారు కిటికీ నుంచి చేయి బయటకు పెట్టి పలకరించగా, మొదట ఓ అభిమాని హ్యాండ్‌షేక్ చేశాడు. అయితే ఆ వెంటనే ఇద్దరూ కలిసి రోహిత్ చేయిని లాగుతూ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రవర్తనతో అసహనం చెందిన రోహిత్ శర్మ వారిని హెచ్చరించాడు. ఆ తర్వాత కారు కిటికీ ఎత్తేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ, సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి 155 పరుగులు చేశాడు. అయితే ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ ఆడనున్నాడు. కొత్త ఏడాదిలో కూడా తన ఫామ్‌ను కొనసాగించాలనే లక్ష్యంతో హిట్‌మ్యాన్ సిద్ధమవుతున్నాడు.
2025 ఏడాది రోహిత్ శర్మకు మరపురాని సంవత్సరంగా నిలిచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు కెప్టెన్సీ చేస్తూ టైటిల్ అందించాడు. అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచిన రోహిత్, భారత్ తరఫున మూడో అత్యధిక వన్డే రన్స్ చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.
Rohit Sharma is the greatest player of india and misbehaving with him like this is totally inappropriate👍
— Gillfied⁷ (@Gill_Iss) January 4, 2026
వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా షాహిద్ అఫ్రిది రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 352వ సిక్సర్ బాది ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం 279 వన్డేల్లో రోహిత్ ఖాతాలో 355 సిక్సర్లు ఉన్నాయి. 2025లో 14 ఇన్నింగ్స్‌ల్లో 650 పరుగులు చేసిన రోహిత్, సగటు 50, స్ట్రయిక్ రేట్ 100కి పైగా నమోదు చేశాడు. రెండు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. మే నెలలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, వైట్ బాల్ ఫార్మాట్‌లలో మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నాడు.