Rishabh Pant: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కంటే మెరుగ్గా రిషబ్ పంత్.. 3 సెంచరీలతో!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో రిషభ్ పంత్ తన బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లిష్ గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన గత 8 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రిషభ్ పంత్ 50(106), 146(111), 57(86), 134(178), 118(140), 25(42), 65(58), 74(112) పరుగులు చేశాడు.
- By Gopichand Published Date - 04:32 PM, Sun - 13 July 25

Rishabh Pant: క్రికెట్‌లో ఒక సమయం ఉండేది. అప్పుడు వికెట్ కీపర్ల పాత్ర కేవలం వికెట్ కీపింగ్ మాత్రమే అయి ఉండేది. వారు కొంచెం బ్యాటింగ్ చేసినా.. ప్లేయింగ్ 11లో వారి స్థానం ఖాయం అయ్యేది. నేటి క్రికెట్‌లో ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఈ రోజుల్లో వికెట్ కీపర్లు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌ల కంటే కూడా ఉత్తమ ప్రదర్శన చేస్తున్నారు. కొత్త యుగం వికెట్ కీపర్లలో ఒక పెద్ద పేరు రిషభ్ పంత్ (Rishabh Pant). ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో పంత్ గణాంకాలు కొంతకాలం రోహిత్-విరాట్ కంటే కూడా మెరుగ్గా ఉన్నాయి.
రోహిత్, విరాట్ కంటే ముందున్న రిషభ్ పంత్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లో రిషభ్ పంత్ తన బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లిష్ గడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన గత 8 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో రిషభ్ పంత్ 50(106), 146(111), 57(86), 134(178), 118(140), 25(42), 65(58), 74(112) పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 4 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇటువంటి గణాంకాలు ప్రస్తుత బ్యాట్స్‌మెన్‌లలో ఎవరికీ ఇంగ్లండ్‌లో లేవు. దిగ్గజ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కూడా ఒక సమయంలో ఇంగ్లండ్ పర్యటన కష్టంగా ఉండేది. కానీ పంత్‌కు ఈ దేశంలో ఆడటం చాలా ఇష్టం ఉన్నట్లు పై గణంకాలే చెబుతున్నాయి. పంత్ టెస్ట్ డెబ్యూ కూడా ఇంగ్లండ్‌లోనే జరిగింది.
Also Read: Maruti Suzuki: మారుతీ సుజుకీకి పిడుగులాంటి వార్త.. భారీగా పడిపోయిన అమ్మకాలు!
Rishabh Pant in the Last 8 innings Vs England in England in Tests:
50(106), 146(111), 57(86), 134(178), 118(140), 25(42), 65(58), 74(112).
– This is Remarkable consistency by Spidey Pant. 🔥 pic.twitter.com/iEhd8ahRtY
— Tanuj (@ImTanujSingh) July 13, 2025
రిషభ్ పంత్ విదేశీ గడ్డపై విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాడు
స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఇంగ్లండ్‌లో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో కూడా అద్భుతంగా రాణిస్తాడు. దీని కారణంగానే అతను ప్రస్తుతం టాప్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఉన్నాడు. వైస్-కెప్టెన్సీ లభించిన తర్వాత పంత్ బ్యాటింగ్ మరింత మెరుగైంది. ఇంగ్లిష్ జట్టును వారి సొంత గడ్డపై ఓడించాలంటే టీమ్ ఇండియాకు రిషభ్ పంత్ బ్యాట్‌తో ఇలాంటి ధమాకా ఇన్నింగ్స్‌లే కావాలి. భారత జట్టు చివరిసారిగా ఇంగ్లండ్‌ను వారి గడ్డపై 2007లో ఓడించింది.