HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Audi India Price Hike Prices Of Audi Luxury Cars To Increase From April 1

Audi India price hike: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆడి లగ్జరీ కార్ల ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 12-03-2026 - 3:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Audi Price Hike
Audi Price Hike

Audi  మీరు కొత్త కారు కొనుగోల చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఇది మీకోసమే. మీరు లగ్జరీ కారు కొనుగోలు చేయాలనుకుంటే, అది కూడా ఆడి కంపెనీ కారు అయితే వెంటనే కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే ఆడి ఇండియా కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 నుంచే కొత్త ధరలను అమలులోకి తీసుకొస్తోంది. మరి ఒక్కో కారుపై ఎంత పెంచుతుందో తెలుసుకుందాం.

మీరు మంచి లగ్జరీ కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే బిగ్ అలర్ట్. ఆడి (Audi) కారు గనక కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే మీరు వెంటనే కొనుగోలు చేయడం మంచిది. ఎందుకంటే జర్మనీకి చెందిన ఈ ప్రముఖ లగ్జరీ కార్ల తాయరీ సంస్థ తమ కంపెనీకి చెందిన కార్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. భారత్‌లో విక్రయిస్తున్న అన్ని రకాల మోడళ్లపై ధరల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. పెంచిన ధరలను వచ్చే నెల ఏప్రిల్ 1, 2026 నుంచే అమలులోకి తీసుకొస్తున్నామని తెలిపింది. అంటే మార్చి 31 వరకు పాత ధరలతోనే కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా ఆడి కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే వెంటనే కొనడం మంచిది.

ఆడి ఇండియా కంపెనీకి చెందిన అన్ని రకాల మోడళ్లపై 2 శాతం వరకు ధరలు పెంచుతున్నామని, పెరిగిన ధరలను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకొస్తున్నామని ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. దేశంలో పెరుగుతున్న ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతుండడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ముడి సరకు ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోతుండడం కంపెనీపై అదనపు భారాన్ని వేస్తోందని, అందులో కొంత కస్టమర్లకు బదిలీ చేయక తప్పడం లేదని పేర్కొన్నారు.

భారత్‌లో లగ్జరీ కార్లతో పాటుగా ఎస్‌యూవీ కార్లను ఆడి కంపెనీ విక్రయిస్తోన్న సంగతి తెలిసిందే. క్యూ3 ఎస్‌యూవీ నుంచి ఎస్‌యూవీ ఆర్ఎస్ క్యూ8 వరకు కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కార్ల ధరలు రూ.43.23 లక్షల నుంచి రూ.2.34 కోట్లు (ఎక్స్ షోరూమ్ ధర) వరకు ఉన్నాయి. భారత్‌లో ప్రీమియం లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇతర కంపెనీలు వివిధ మోడళ్లను భారత మార్కెట్లోకి లాంచ్ చేసినప్పటికీ చాలా మంది ఆడి కార్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖ ఇళ్లల్లో ఆడికి చెందిన కార్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. విలాసవంతమైన కార్ల బ్రాండ్‌లో ఆడికి మంచి ఆదరణ ఉంది. భారత్‌లో ఈ కార్లు కొనుగోలు చేయడం హుందాగా భావిస్తారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • audi
  • Audi India
  • automobile
  • increase-prices
  • price hike

Related News

Condom Shortage In India

Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

War Effect  పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారతీయ కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపబోతున్నాయి. దేశంలోని రూ. 8,170 కోట్ల కండోమ్ తయారీ పరిశ్రమ తీవ్రమైన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా కండోమ్‌ల ధరలు 50 శాతం వరకు పెరగవచ్చని, మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొరతకు పెరిగిన డిమాండ్ కారణం కాదు. యుద్ధం కారణంగా

    Latest News

    • ఈరోజు బ్యాంక్‌ల‌కు హాలిడే ఉందా?

    • ఐపీఎల్ 2026లో స‌రికొత్త రికార్డు.. మొదటి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు!

    • బోణీ కొట్టిన హైద‌రాబాద్‌.. హోం గ్రౌండ్‌లో కేకేఆర్ చిత్తు!

    • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

    • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

    Trending News

      • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

      • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

      • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

      • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

      • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd