HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rcb On Sale This Pharma Business Tycoon Is Ready To Bid

ఆర్‌సీబీ కొనుగోలుకు అదార్ పూనావాలా సిద్ధం.. రూ. 18,314 కోట్లకు డీల్ కుదిరే అవకాశం?

ఈ ప్రతిపాదిత విక్రయం పూర్తయితే ఇటీవలే అత్యధిక ధరకు అమ్ముడైన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ వాల్యుయేషన్‌ను కలిగి ఉంటుంది.

  • Author : Gopichand Date : 23-01-2026 - 5:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RCB On Sale
RCB On Sale

RCB On Sale: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా రాబోయే కొద్ది నెలల్లో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్‌సీబీ కొనుగోలు కోసం ఒక ‘స్ట్రాంగ్- కాంపిటీటివ్’ బిడ్‌ను వేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆర్‌సీబీ యాజమాన్య హక్కులు డయాజియో నియంత్రణలో ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ వద్ద ఉన్నాయి. వార్తల ప్రకారం.. ఈ ఫ్రాంచైజీని విక్రయించడానికి వారు 2 బిలియన్ డాలర్లు డిమాండ్ చేశారు.

అదార్ పూనావాలా ఎక్స్‌ (X) వేదికగా స్పందిస్తూ.. “రాబోయే కొద్ది నెలల్లో ఐపీఎల్‌లోని అత్యుత్తమ జట్లలో ఒకటైన @RCBTweets కోసం నేను బలమైన, పోటీతత్వంతో కూడిన బిడ్‌ను వేస్తాను” అని రాశారు.

Also Read: అజూర్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్.. 238 మంది ప్రయాణికులు సురక్షితం!

2025లోనే అందిన సంకేతాలు

అక్టోబర్ 2025లోనే అదార్ పూనావాలా ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ.. “సరైన వాల్యుయేషన్ ఉంటే @RCBTweets ఒక అద్భుతమైన టీమ్” అని పేర్కొన్నారు. పూనావాలా సందేశం చిన్నదైనప్పటికీ అది సరైన సమయంలో రావడంతో పరిశ్రమ వర్గాల్లో చర్చకు దారితీసింది. మాజీ ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోదీ కూడా ఆర్‌సీబీ ఒక ‘ప్రైమ్ ఇన్వెస్ట్‌మెంట్’ అని బహిరంగంగా సూచించారు. గ్లోబల్ లేదా సావరిన్ ఫండ్స్ ఈ ఫ్రాంచైజీ కోసం క్యూ కడతాయని ఆయన అభిప్రాయపడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

అత్యంత విలువైన ఫ్రాంచైజీగా అవతరించే అవకాశం

ఒకవేళ ఈ డీల్ 2 బిలియన్ డాలర్ల (రూ. 1,83,14,05,00,000) వద్ద జరిగితే క్రికెట్ చరిత్రలోనే అత్యంత విలువైన సింగిల్-టీమ్ ప్రాపర్టీలలో ఒకటిగా ఆర్‌సీబీ నిలుస్తుంది. ఈ విక్రయ ప్రక్రియను పర్యవేక్షించడానికి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సిటీని లావాదేవీల సలహాదారుగా నియమించినట్లు కూడా సమాచారం.

LSG కంటే రెట్టింపు వాల్యుయేషన్

ఈ ప్రతిపాదిత విక్రయం పూర్తయితే ఇటీవలే అత్యధిక ధరకు అమ్ముడైన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ వాల్యుయేషన్‌ను కలిగి ఉంటుంది. ఆర్పీఎస్‌జీ (RPSG) గ్రూప్ అప్పట్లో లక్నో టీమ్‌ను రూ. 7,090 కోట్లకు కొనుగోలు చేసింది.

గమనిస్తే.. 2008 ఐపీఎల్ వేలంలో విజయ్ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్ ఆర్‌సీబీని సుమారు 111.6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత దశాబ్ద కాలంలో లండన్ లిస్టెడ్ దిగ్గజం డయాజియో.. యునైటెడ్ స్పిరిట్స్‌లో నియంత్రణ వాటాను పొందింది. 2014 నాటికి మెజారిటీ వాటాదారుగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adar Poonawalla
  • IPL 2026
  • rcb
  • RCB On Sale
  • sports news
  • virat kohli

Related News

Suryakumar Yadav

టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ప్రపంచకప్ విజయం ఎంతో చారిత్రాత్మకమైనదని, అయితే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

  • Gautam Gambhir

    టీమిండియా ఘనవిజయం.. ధోనీ పోస్ట్‌పై గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • IPL 2026

    ఐపీఎల్ 2026 షెడ్యూల్.. మార్చి 28న తొలి మ్యాచ్‌?

  • Ishan Kishan

    క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

  • King Kohli Posted An Instag

    కోహ్లి రికార్డును అలవోకగా చెరిపేసిన సంజూ శాంసన్

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

  • BYST : ఏపీ యువతకు గొప్ప వరం.. BYST – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య చారిత్రాత్మక ఒప్పందం

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

    • ఫైనల్ మ్యాచ్ పిచ్ ఎలా ఉండబోతోంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd