అజూర్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్.. 238 మంది ప్రయాణికులు సురక్షితం!
ఫ్లైట్రాడార్ సమాచారం ప్రకారం.. గాలిలో 6.6 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం సంకేతాలు కనిపించాయి.
- Author : Gopichand
Date : 23-01-2026 - 5:14 IST
Published By : Hashtagu Telugu Desk
Flight Emergency Landing: 2026 జనవరి 23న థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుండి రష్యాలోని బర్నాల్‌కు వెళ్తున్న అజూర్ ఎయిర్‌లైన్స్ (Azur Airlines) విమానం ZF-2998 లో సాంకేతిక లోపం తలెత్తింది. గాలిలో ఉండగానే పైలట్‌కు సాంకేతిక సమస్య ఉన్నట్లు సిగ్నల్ అందడంతో వెంటనే చైనాలోని లాంఝౌ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారు.
విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితం
విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అజూర్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. విమానంలోని 238 మంది ప్రయాణికులు, క్రూ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం విమానంలో తలెత్తిన సాంకేతిక లోపంపై విచారణ జరుగుతోంది.
Also Read: గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
6.6 కిలోమీటర్ల ఎత్తులో తలెత్తిన సమస్య
ఫ్లైట్రాడార్ సమాచారం ప్రకారం.. గాలిలో 6.6 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం సంకేతాలు కనిపించాయి. ఈ విమానం మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో రష్యాకు బయలుదేరింది. అత్యవసర ల్యాండింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుగా ఈ విమానం లాంఝౌ విమానాశ్రయానికి పశ్చిమ భాగంలో సుమారు 45 నిమిషాల పాటు హోల్డింగ్ ప్యాటర్న్‌లో (గాలిలోనే తిరుగుతూ) ఉండిపోయింది.