Ravichandran Ashwin: చరిత్ర సృష్టించడానికి 6 వికెట్ల దూరంలో అశ్విన్!
ఆర్ అశ్విన్ 194 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, నాథన్ లియాన్ 187 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇది కాకుండా పాట్ కమిన్స్ 175 వికెట్లు తీశాడు. 147 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
- By Gopichand Published Date - 06:49 PM, Wed - 20 November 24

Ravichandran Ashwin: నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఈసారి చాలా రకాలుగా ప్రత్యేకం. ఈసారి భారత్ తన సీనియర్ ఆటగాళ్లపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంది. అశ్విన్ (Ravichandran Ashwin) ఆస్ట్రేలియాపై జట్టుకు అత్యంత ముఖ్యమైన స్పిన్ బౌలర్ అని నిరూపించగలడు. అశ్విన్ చరిత్ర సృష్టించేందుకు కేవలం 6 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే అశ్విన్ ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా అవతరించబోతున్నాడు.
అశ్విన్ చరిత్ర సృష్టించబోతున్నాడు
భారత్ తరఫున ఆర్ అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆస్ట్రేలియాపై 6 వికెట్లు తీస్తే ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా అశ్విన్ నిలవనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు 194 వికెట్లు తీశాడు అశ్విన్. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాపై మరో 6 వికెట్లు తీస్తే డబ్ల్యూటీసీలో 200 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కన్నాడు.
అయితే ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్‌తో తలపడనున్నాడు. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు లియాన్ 187 వికెట్లు కూడా తీశాడు. అశ్విన్ గురించి మాట్లాడుకుంటే.. అతను గత సిరీస్‌లో అద్భుతంగా ఆడాడు. 12 వికెట్లు పడగొట్టి టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
WTCలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్
ఆర్ అశ్విన్ 194 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, నాథన్ లియాన్ 187 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇది కాకుండా పాట్ కమిన్స్ 175 వికెట్లు తీశాడు. 147 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ నాలుగో స్థానంలో ఉన్నాడు. స్టువర్ట్ బ్రాడ్ 134 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, ప్రసిధ్ కృష్ణ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్.