HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rahul Yashasvi 1st Indian Opening Pair Create Records

Rahul-Yashasvi: పెర్త్‌లో రికార్డు సృష్టించిన భారత బ్యాట్స్‌మెన్.. 1948 త‌ర్వాత ఇప్పుడే!

KL రాహుల్- జైస్వాల్ 2010 సంవత్సరం తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలలో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

  • Author : Gopi Date : 23-11-2024 - 8:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul-Yashasvi
Rahul-Yashasvi

Rahul-Yashasvi; ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ (Rahul-Yashasvi) అద్భుతాలు చేశారు. రెండో రోజు ఆట ముగిసే వరకు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి అజేయంగా ఉన్నారు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఎన్నో రికార్డులు సృష్టించారు. ఈ క్ర‌మంలోనే రాహుల్, జైస్వాల్ ఇద్దరూ కలిసి 1948లో వినూ మన్కడ్, చందు సర్వాతేల రికార్డును బద్దలు కొట్టారు.

జైస్వాల్- రాహుల్ అద్భుతమైన భాగ‌స్వామ్యం

రెండో రోజు ఆట ముగిసే వరకు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ మొదటి వికెట్‌కు 172 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 1948 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో ఓపెనర్లుగా వినూ మన్కడ్, చందు సర్వాటే చేసిన 124 పరుగుల రికార్డును బద్దలు కొట్టారు. అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియాలో తొలి వికెట్ భాగస్వామ్య రికార్డును రాహుల్, జైస్వాల్ బద్దలు కొట్టారు. ఇది కాకుండా ఇద్దరు ఆటగాళ్లు 1981 సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై సునీల్ గవాస్కర్- చేతన్ చౌహాన్‌ల భాగస్వామ్య రికార్డును కూడా బద్దలు కొట్టారు. ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రికార్డు సునీల్ గవాస్కర్, శ్రీకాంత్ పేరిట ఉంది. వీరిద్దరూ కలిసి 191 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Also Read: Samsung : డిజిటల్ హెల్త్, ఏఐ ఇతర కొత్త సాంకేతికతలపై సామ్‌సంగ్ ఒప్పందం..

ఆస్ట్రేలియాలో భారత ఓపెనింగ్ జోడీకిది అతిపెద్ద భాగస్వామ్యం

  • 191 పరుగులు – సునీల్ గవాస్కర్- శ్రీకాంత్ (1986)
  • 172 పరుగులు – యశస్వి జైస్వాల్- KL రాహుల్ (2024)
  • 165 పరుగులు- సునీల్ గవాస్కర్- చేతన్ చౌహాన్ (1981)
  • 141 పరుగులు- ఆకాశ్ చోప్రా- వీరేంద్ర సెహ్వాగ్ (2003)
  • 124 పరుగులు- వినూ మన్కడ్- చందు సర్వాతే (1948)*
  • 123 పరుగులు- ఆకాశ్ చోప్రా- వీరేంద్ర సెహ్వాగ్ (2004)

KL రాహుల్- జైస్వాల్ 2010 సంవత్సరం తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాలలో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గత 14 ఏళ్ల క్రితం వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ 2010లో సెంచూరియన్ మైదానంలో కలిసి ఈ ఘనత సాధించారు. వీరిద్దరూ 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

SENAలో 2010 నుండి భారతదేశానికి అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం

  • 172* – యశస్వి జైస్వాల్- KL రాహుల్, 2024లో పెర్త్
  • 137- గౌతమ్ గంభీర్- సెహ్వాగ్, 2010లో సెంచూరియన్
  • 126 – KL రాహుల్- రోహిత్ శర్మ, 2021లో లార్డ్స్
  • 97 – KL రాహుల్- రోహిత్ శర్మ, 2021లో నాటింగ్‌హామ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • BCCI
  • Border-Gavaskar Trophy
  • cricket
  • IND vs AUS
  • india
  • KL Rahul
  • sports news
  • TeamIndia
  • yashasvi jaiswal

Related News

Cng Gas

CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర

    Latest News

    • Mahanadu : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం

    • Karnataka : వీడ్కోలు సమావేశంలో భావోద్వేగ క్షణాలు.. డీకేకు ఆశీర్వాదం ఇచ్చిన సిద్దరామయ్య

    • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

    • NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

    • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd