Odisha MTS Exam: ప్రభుత్వ పరీక్ష పత్రంలో స్టార్ క్రికెటర్ల పేర్లు, ఆన్సర్ ఏంటి?
ఒడిశాలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పరీక్షలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డు ఎవరికి లభించిందనే ప్రశ్నకు.సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్ పేర్లు ఆప్షన్స్ గా ఇచ్చారు. అయితే క్రికెట్ గురించి తెలిసిన ప్రతిఒక్కరికి ఆ ప్రశ్నకు సమాధానం జస్ప్రీత్ బుమ్రా అని తెలుసు.
- By Praveen Aluthuru Published Date - 03:42 PM, Wed - 4 September 24
Odisha MTS Exam: విదేశీ గడ్డపై టి20 ప్రపంచ కప్ గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించింది. 2007లో తొలి ఐసీసీ టి20 టోర్నీ గెలిచిన భారత్, చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ సారధ్యంలో ఆ కల సాకారమైంది. అయితే ఈ విజయం ఎప్పటికీ మర్చిపోలేం. టోర్నీ గెలిచిన కాసేపటికే టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఫార్మేట్ కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం టి20 కెప్టెన్ బాధ్యతలను సూర్య కుమార్ యాదవ్ చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పోటీ పరీక్షలో టి20 ప్రపంచకప్ గురించి ప్రశ్న ఎదురైంది.
ఒడిశాలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పరీక్షలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు ఎవరికి లభించిందనే ప్రశ్నకు.సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా మరియు కుల్దీప్ యాదవ్ పేర్లు ఆప్షన్స్ గా ఇచ్చారు. అయితే క్రికెట్ గురించి తెలిసిన ప్రతిఒక్కరికి ఆ ప్రశ్నకు సమాధానం జస్ప్రీత్ బుమ్రా అని తెలుసు. జస్ప్రీత్ బుమ్రా. 8 మ్యాచ్‌ల్లో మొత్తం 15 వికెట్లు తీశాడు. బుమ్రా టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కానప్పటికీ అతను కేవలం 4.17 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చినందున, అతనికి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు లభించింది. టీ20 ప్రపంచకప్ లో 17 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఫజల్ హక్ ఫరూఖీ సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచారు. 8 మ్యాచ్‌ల్లో 28.42 సగటుతో 2 హాఫ్ సెంచరీల సహాయంతో మొత్తం 199 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ ప్రశ్నపత్రంలో నాలుగవ ఆప్షన్ గా ఉన్నాడు. ఆప్షన్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీ పేరు కూడా ఆప్షన్ లో ఉంది.
టోర్నీ ఆరంభంలో తడబడ్డ కోహ్లీ ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో కోహ్లీ 76 పరుగులతో భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు కోహ్లీ అన్ని మ్యాచ్‌ల్లో కలిపి 75 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read: Floods in AP : వరదల్లో చనిపోయిన వారికీ ప్రభుత్వం తరుపు అంత్యక్రియలు – చంద్రబాబు
Tags
Related News
IND vs BAN Live Updates: కేఎల్ రాహుల్ వర్సెస్ సర్ఫరాజ్ ఖాన్
IND vs BAN Live Updates: కేఎల్ రాహుల్ 2014లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయగా, సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సర్పరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అనుభవం పరంగా ఇద్దరిలో కెఎల్దే పైచేయి.