Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం కావడంపై బీసీసీఐ కీలక ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోందని మనకు తెలిసిందే. అయితే భారత్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి.
- By Gopichand Published Date - 02:22 PM, Sat - 15 February 25

Jasprit Bumrah: భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం కారణంగా ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి తప్పుకున్నాడు. ఇది టీమ్ ఇండియాకు పెద్ద దెబ్బ. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ మ్యాచ్‌లో బుమ్రా గాయపడ్డాడు. గాయం కారణంగా బుమ్రా మ్యాచ్ మధ్యలో మైదానం వదిలి వెళ్ళవలసి వచ్చింది. రెండవ ఇన్నింగ్స్‌లో కూడా బౌలింగ్ చేయలేకపోయాడు. మరోవైపు బుమ్రాపై బీసీసీఐ కొత్త సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా పెద్ద ప్రకటన చేశారు. ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాం.
బుమ్రాపై బీసీసీఐ కీలక ప్రకటన
బుమ్రా గురించి బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా మాట్లాడుతూ.. మేము ఛాంపియన్స్ ట్రోఫీకి మా అత్యుత్తమ జట్టును ఎంపిక చేశాం. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. టీమ్ ఇండియాకు భారీ బెంచ్ బలం ఉంది. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం జట్టు కాంబినేషన్‌లో ఎటువంటి మార్పును కలిగిస్తుందని నేను అనుకోను అని ఆయన అన్నారు.
Also Read: Kishan Reddy : తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్.. బడ్జెట్‌లో నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారని చెప్పాడు. ప్రస్తుతం జట్టులో అంతా సానుకూలంగానే ఉంది. ఇంగ్లండ్ సిరీస్ ఫలితాలు మీ ముందు ఉన్నాయి. దుబాయ్ పరిస్థితి కూడా భారత్ తరహాలోనే ఉంటుంది. ఇంగ్లండ్‌పై టీ20లో 4-1తో విజయం సాధించడం, వన్డేల్లో క్లీన్‌స్వీప్ చేయడం భారత ఆటగాళ్ల మనోధైర్యాన్ని బాగా పెంచాయని ఆయన తెలిపారు.
భారత్ తన తొలి మ్యాచ్ ఎప్పుడు ఆడనుంది?
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోందని మనకు తెలిసిందే. అయితే భారత్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఆ జట్టు ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.