Test Captain Rishabh Pant: రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు.. టీమిండియా మాజీ ఆటగాడు కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా టూర్‌కు బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని స్థానంలో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వటం వివాదానికి దారి తీయొచ్చు.
- Author : Gopichand
Date : 06-11-2024 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
Test Captain Rishabh Pant: న్యూజిలాండ్‌తో సిరీస్ తర్వాత టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 22న జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడడం కష్టం కాబట్టి టీమ్ ఇండియా బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఈ మ్యాచ్ ముందున్న అతిపెద్ద ప్రశ్న.
వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా టూర్‌కు జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో అతను జట్టుకు నాయకత్వం వహించగలడని నమ్ముతారు. అయితే రిషబ్ పంత్ (Test Captain Rishabh Pant)కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అంటున్నాడు.
Also Read: IPL 2025 Auction Venue: ఐపీఎల్ మెగా వేలం వేదిక మార్పు.. వేలంలోకి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు!
మహ్మద్ కైఫ్ ఏమన్నాడంటే?
జట్టు కెప్టెన్సీ గురించి మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ప్రస్తుత జట్టులో కెప్టెన్సీకి రిషబ్ పంత్ అతిపెద్ద పోటీదారు అని చెప్పాడు. పంత్ కెప్టెన్‌కు అర్హుడు. పంత్ ఎప్పుడు ఆడినా, అతను ఎల్లప్పుడూ టీమ్ ఇండియాను ఫ్రంట్ ఫుట్‌లో ఉంచుతాడు. అతను ఎప్పుడూ టీమ్ ఇండియాను గెలిపించడానికి ప్రయత్నిస్తాడు. అతను ప్రతి సందర్భంలోనూ పరుగులు చేయగలడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో పరుగులు సాధించాడు. భారత్ టర్నింగ్ పిచ్‌పై కూడా పరుగులు సాధించాడు. అతను పూర్తి బ్యాట్స్‌మెన్ అని చెప్పాడు.
పంత్‌ను ప్రశంసిస్తూ.. “పంత్ తన చివరి మ్యాచ్ ఆడినప్పుడు అతను లెజెండ్‌గా రిటైర్ అవుతాడు. అతని వికెట్ కీపింగ్ మెరుగుపడింది. అతను న్యూజిలాండ్‌తో క్రీజులో ఉన్న సమయానికి న్యూజిలాండ్ కష్టాలు పెరిగాయి. కాబోయే కెప్టెన్ కోసం టీమ్ ఇండియా వెతుకుతున్నట్లయితే పంత్‌ను మించిన ఆప్షన్ మరొకటి లేదని తెలిపాడు.
బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు
ఆస్ట్రేలియా టూర్‌కు బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని స్థానంలో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వటం వివాదానికి దారి తీయొచ్చు. ఇంతకుముందు కూడా బుమ్రా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.