HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >An Illicit Affair With A Younger Man And The Mother In Law Was Murdered For Being In The Way

తనకన్నా చిన్నవాడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్య

  • Author : Vamsi Chowdary Korata Date : 07-02-2026 - 3:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Illegal Affair News
Illegal Affair News
AP News  చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ, తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భావించి భర్తను, అత్తను హత్య చేయించేందుకు ప్రయత్నించింది. ప్రియుడి చేత అత్తపై దాడి చేయించగా, ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నగరం చామంతిపురానికి చెందిన కవిత (37)కు 17 ఏళ్ల క్రితం విజయ్‌తో వివాహమైంది. వీరికి 14, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కవిత అదే ప్రాంతంలో నివసించే 17 ఏళ్ల బాలుడితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త విజయ్‌, అత్త నిర్మల పలుమార్లు ఆమెను హెచ్చరించారు. దీంతో వారిపై కక్ష పెంచుకున్న కవిత, తన సంబంధానికి అడ్డుగా ఉన్న ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలోనే భర్తను, అత్తను హత్య చేయాలంటూ తన ప్రియుడైన మైనర్ బాలుడిని రెచ్చగొట్టింది. ఆమె మాటలు నమ్మిన బాలుడు, ఈ నెల‌ 5వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న నిర్మలపై దాడికి తెగబడ్డాడు. ఆమె కళ్లల్లో కారం చల్లి, కత్తితో గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే, నిర్మల అతడిని గట్టిగా ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. జనాలను చూసి భయపడిన బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

తీవ్ర గాయాలపాలైన నిర్మలను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడైన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కవిత రెచ్చగొట్టడం వల్లే తాను ఈ దాడికి పాల్పడినట్లు బాలుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కవిత పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adultery
  • andhra pradesh police
  • Andhrapradesh. AP News
  • AP crime news
  • ap news
  • Chittoor
  • crime news
  • Extra Marital Affair
  • Minor boy
  • murder attempt
  • nirmala

Related News

Jacqueline Fernandez Appeal For Become Approver Against Sukesh Chandrashekhar

Jacqueline Fernandez : అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది. జాక్వెలిన్ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం, ఈ విషయంలో ముందుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి

  • AndhraPradesh Police Special Leaves

    AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్

  • Bengaluru Fitness Trainer Dies By Suicide

    వివాహిత మహిళ బ్లాక్‌మెయిల్‌.. బెంగళూరు ఫిట్‌నెస్ ట్రైనర్ ఆత్మహత్య

Latest News

  • Mahindra University : మహీంద్రా యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రారంభం

  • HMD : హెచ్ఎండీ బ్రాండ్ అంబాసిడర్‌గా రాఘవ్ జుయల్

  • Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Delimitation : డీలిమిటేషన్ ను స్వాగతిస్తున్నాం అంటూనే మెలిక పెట్టిన వైసీపీ ఎంపీ

  • 2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd