MI vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
- By Praveen Aluthuru Published Date - 07:35 PM, Mon - 1 April 24

MI vs RR: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్‌లో తొలిసారిగా తమ స్వదేశంలో మ్యాచ్‌లు ఆడనుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండిట్లోనూ ఓటమి చవిచూసింది. కాగా సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించాలనే ఉద్దేశంతో మైదానంలోకి దిగనుంది.
ముంబై, రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ హెడ్-టు-హెడ్ రికార్డ్స్ చూస్తే.. రెండు జట్లు మొత్తం 28 సార్లు తలపడ్డాయి, వాటిలో ముంబై 15 మ్యాచ్‌లు గెలిచింది, ఆర్ఆర్ 12 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది.
We’re now on WhatsApp. Click to Join.
ముంబై ఇండియన్స్- ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, జెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా.
రాజస్థాన్ రాయల్స్- యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), ర్యాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, నాంద్రే బెర్గర్, అవేష్ ఖాన్.
Also Read: T.Congress : 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపికపై టీ.కాంగ్రెస్ కసరత్తు