Zaheer as LSG Mentor: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్ ఖాన్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ లక్నోతో జత కట్టనున్నాడని సంజీవ్ గోనికా ప్రకటించారు. ప్రస్తుతం లక్నో జట్టుకి జహీర్ ఖాన్ మెంటర్ గా, జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా, లాన్స్ క్లూసెనర్ మరియు ఆడమ్ వోజెస్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. జహీర్ ఖాన్ 2008లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసాడు. చివరిగా 2017లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు
- Author : Praveen Aluthuru
Date : 28-08-2024 - 4:55 IST
Published By : Hashtagu Telugu Desk
Zaheer as LSG Mentor: బుధవారం కోల్‌కతాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోనికా సంచలన ప్రకటన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 వేలానికి ముందు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను జట్టు మెంటార్‌గా నియమించింది. గౌతమ్ గంభీర్ కేకేఆర్ లో చేరిన తర్వాత ఈ పోస్ట్ ఖాళీ అవ్వడంతో ఇప్పుడు అతని స్థానంలో జహీర్ ఖాన్‌కు ఈ బాధ్యత అప్పగించారు.
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ లక్నోతో జత కట్టనున్నాడని సంజీవ్ గోనికా ప్రకటించారు. ప్రస్తుతం లక్నో జట్టుకి జహీర్ ఖాన్ మెంటర్ గా, జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా, లాన్స్ క్లూసెనర్ మరియు ఆడమ్ వోజెస్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. జహీర్ ఖాన్ 2008లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసాడు. చివరిగా 2017లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. అతను 2018 నుండి 2022 వరకు ముంబై ఇండియన్స్‌తో ఉన్నాడు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా నియమితుడయ్యాడు.ఐపీఎల్ లో ఆటగాడిగా జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 100 మ్యాచ్‌లు ఆడాడు. 7.58 ఎకానమీ రేటుతో 102 వికెట్లు తీశాడు.
జహీర్ 2018 నుండి 2022 వరకు ముంబై ఇండియన్స్ కాంపౌండ్ లో అనేక బాధ్యతలు చేపట్టాడు. ముంబైకి మొదట క్రికెట్ డైరెక్టర్‌గా తరువాత గ్లోబల్ డెవలప్‌మెంట్ హెడ్‌గా పనిచేశాడు. కాగా లక్నోని 2022లో సంజీవ్ గోయెంకా 7090 కోట్లకు కొనుగోలు చేశారు. 2022 మరియు 2023 సీజన్‌లలో లక్నో ప్లేఆఫ్‌లకు చేరుకుంది, ఎలిమినేటర్ మ్యాచ్‌లలో రెండుసార్లు పోటీ నుండి నిష్క్రమించింది. నెగెటివ్ నెట్ రన్ రేట్ కారణంగా గత ఎడిషన్ ప్లేఆఫ్‌కు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ సీజన్లో లక్నో పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది.
Also Read: Shocking Video : నదిలోకి 50 ఆవులను తోసేసిన దుర్మార్గులు.. 20 ఆవుల మృతి