Shocking Video : నదిలోకి 50 ఆవులను తోసేసిన దుర్మార్గులు.. 20 ఆవుల మృతి
మధ్యప్రదేశ్‌లోని బామ్‌హోర్ సమీపంలో ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. దాని కింద నుంచి సత్నా నది ప్రవహిస్తుంటుంది.
- By Pasha Published Date - 04:44 PM, Wed - 28 August 24

Shocking Video : ప్రాణం ఏ జీవికైనా ఒకటే. మూగ జీవాలను హింసించడం అనేది మానవ ధర్మం కాదు. ఇవన్నీ తెలిసి కూడా కొందరు దారుణంగా ప్రవర్తించారు. దాదాపు 50 ఆవులను నదిలోకి తోసేశారు. ఈ ఘటనలో దాదాపు 20 ఆవులు చనిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బామ్‌హోర్‌లో చోటుచేసుకుంది.
सोशल मीडिया के द्वारा प्रकरण संज्ञान में आते ही मामले में थाना नागोद में अपराध क्रमांक 535/24 धारा 325, 3(5) भारतीय न्याय संहिता (बी एन एस), 4/9 म.प्र. गौ-वंश वध प्रतिषेध अधिनियम 2004 का अपराध आरोपियों के विरुद्ध पंजीबद्ध कर कार्यवाही जारी है। @CMMadhyaPradesh @DGP_MP @IG_Rewa https://t.co/2jIn9tqy0M
— SP_SATNA (@satna_sp) August 28, 2024
We’re now on WhatsApp. Click to Join
మధ్యప్రదేశ్‌లోని బామ్‌హోర్ సమీపంలో ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. దాని కింద నుంచి సత్నా నది ప్రవహిస్తుంటుంది. మేత కోసం వదిలిన దాదాపు 50 ఆవులను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా నదిలోకి తోసేశారు. ఈ ఘటనలో చాలా ఎత్తు నుంచి నదిలో పడటంతో 20 ఆవులు చనిపోయాయి. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన బెటా బగ్రి, రవి బగ్రి, రామ్‌పాల్ చౌదరీ, రాజ్లు చౌదరీ అనే నలుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నదిలో పడిపోయిన మిగతా ఆవులను కాపాడేందుకు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఇంతకీ వాళ్లు ఎందుకిలా చేశారు ? సదరు పశువుల యజమానులతో ఏమైనా గొడవలు ఉన్నాయా ? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా ? అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఈ ఘటనపై గోసంరక్షణ కోసం పాటు పడే సంఘాలు గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read :Industrial Smart Cities : కేంద్రం గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణలలో స్మార్ట్ పారిశ్రామిక నగరాలు
హైదరాబాద్‌కు గోవులను తరలిస్తుండగా..
ఈనెల 27న తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు గోవులను తరలిస్తుండగా.. ఊపిరాడక మార్గంమధ్యలో పది గోవులు చనిపోయాయి. పోలీసులు రైడ్ చేసి కరీంనగర్ జిల్లా రేణిగుంట టోల్ ప్లాజా వద్ద పశువులను అక్రమంగా తరలిస్తున్న ఈ లారీని పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలోని గోవులను ఎల్ఎండీ కాలనీలోని మృత్యుంజయ గోశాలకు తరలించారు.