IPL 2024: ఐపీఎల్ పై పార్లమెంట్ ఎన్నికల ఎఫెక్ట్
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మన దేశంలో జరుగుతుందా? లేక విదేశాలకు వెళ్లాలా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- Author : Praveen Aluthuru
Date : 11-12-2023 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
IPL 2024: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మన దేశంలో జరుగుతుందా? లేక విదేశాలకు వెళ్లాలా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ఐపీఎల్ నిర్వహణపై కీలక సమాచారం అందించారు. ఈసారి ఐపీఎల్ మార్చి నెలాఖరులో ప్రారంభం కానుందని స్పష్టం చేశాడు. ఐపీఎల్ సీజన్ 17 మార్చి చివరిలో ప్రారంభమై మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో ముగుస్తుందని జై షా ధృవీకరించారు.కాగా ఈసారి ఐపీఎల్ వేలం ప్రక్రియ డిసెంబర్ 19న జరగనుంది.దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మినీ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ప్రస్తుతం 10 జట్లలో ఖాళీల సంఖ్య 77 మాత్రమే. అంటే ఈసారి ఐపీఎల్‌లో 77 మంది ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కనుంది. అయితే ఇక్కడ పర్స్ మొత్తాన్ని బట్టి ఒక్కో జట్టుకు అవకాశం లభిస్తుంది. అంటే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఒక జట్టులో కనీసం 18 మంది ఆటగాళ్లు మరియు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. ఈ ఏడాది ఐపీఎల్ వేలం ప్రక్రియ డిసెంబర్ 19న జరగనుంది.దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మినీ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.
Also Read: WhatsApp – Bus Tickets : వాట్సాప్‌లోనూ ఇక బస్ టికెట్స్ !