WhatsApp – Bus Tickets : వాట్సాప్‌లోనూ ఇక బస్ టికెట్స్ !
WhatsApp - Bus Tickets : ఢిల్లీ మెట్రోలో వాట్సాప్ ద్వారా టికెట్ల జారీ మే నెలలోనే మొదలైంది.
- By Pasha Published Date - 11:34 AM, Mon - 11 December 23

WhatsApp – Bus Tickets : ఢిల్లీ మెట్రోలో వాట్సాప్ ద్వారా టికెట్ల జారీ మే నెలలోనే మొదలైంది. ఇప్పుడు ఢిల్లీ రవాణాశాఖ.. బస్సుల్లోనూ ప్రయాణికులకు వాట్సాప్ ద్వారా టికెట్లను ఇష్యూ చేసే దిశగా ప్రయత్నాలను మొదలుపెట్టింది. దేశ రాజధానిలో డీటీసీ, క్లస్టర్ బస్సుల కోసం డిజిటల్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఢిల్లీ రవాణా శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే వాట్సాప్ ద్వారా వినియోగదారులు బుక్ చేసుకోగలిగే బస్సు టికెట్ల సంఖ్యపై పరిమితి విధిస్తారని తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా తీసుకునే టికెట్‌ను రద్దు చేయడానికి కుదరదు. వాట్సాప్‌లో(WhatsApp – Bus Tickets) క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా టికెట్‌ను బుక్ చేసుకుంటే నామమాత్రంగా కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తారు. వాట్సాప్‌లో UPI ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఎటువంటి సౌకర్య రుసుమును వసూలు చేయరు.
We’re now on WhatsApp. Click to Join.
వాట్సాప్ ద్వారా హైదరాబాద్ మెట్రో టికెట్స్..
- హైదరాబాద్ మెట్రో రైల్ నంబర్ +91 8341146468ను మీ కాంటాక్ట్స్ లిస్టులో సేవ్ చేసుకోండి.
- వాట్సాప్‌లో హైదరాబాద్ మెట్రో రైల్ నంబరుకు Hi అని మెసేజ్ పంపండి.
- ఆ తర్వాత ఈ-టికెటింగ్ కోసం ఒక URL (లింక్) వాట్సాప్ చాట్‌లోకి వస్తుంది. ఈ URL 5 నిమిషాల వరకు లైవ్‌లో ఉంటుంది.
- యూఆర్‌ఎల్‌పై క్లిక్ చేసి ఓపెన్ అయ్యాక.. జర్నీరూట్‌ను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత GPay, PayTM, UPI, PhonePe, Debit Cardలలో ఏదో ఒక ఆప్షన్ ద్వారా పేమెంట్ చేయాలి.
- పేమెంట్ పూర్తయ్యాక ఈ-టికెట్‌కు సంబంధించిన యూఆర్ఎల్ మీ వాట్సాప్ చాట్‌కు వస్తుంది.
- ఆ యూఆర్ఎల్‌పై క్లిక్ చేస్తే QRకోడ్ ఈ-టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది.
- మెట్రో గేట్ వద్ద QR కోడ్ స్కాన్ చేసి లోపలికి ఎంటరై పోవచ్చు.